
Lavanya Tripathi: వస్తూనే సంచలనాలు చేసిన హీరోయిన్స్ లో లావణ్య త్రిపాఠి ఒకరు. ఆమె నటించిన అందాల రాక్షసి క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా లావణ్య ఇండస్ట్రీ వర్గాలను ఆకర్షించింది. యూనిక్ యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను మైమరిపించారు. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కించిన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ ఉండిపోతుంది.
ఆ చిత్రం అనంతరం లావణ్య ఖాతాలో కొన్ని కమర్షియల్ హిట్స్ పడ్డాయి. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి. ఈ క్రమంలో లావణ్యకు బాగానే ఆఫర్స్ వచ్చాయి. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ లావణ్యకు ఎక్కువ శాతం పరాజయాలు ఎదురయ్యాయి. సోగ్గాడే చిన్నినాయనా చిత్రం తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. అర్జున్ సురవరం ఓ మోస్తరు హిట్ చిత్రమని చెప్పాలి.
అర్జున్ సురవరం చిత్రం తర్వాత లావణ్య నటించిన ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే ఘోర పరాజయం పొందాయి. ఆ దెబ్బతో లావణ్యకు తెలుగులో ఆఫర్స్ ఆగిపోయాయి. ఇటీవల డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. పులి మేక టైటిల్ తో సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ చేశారు. లావణ్య తన ఇమేజ్ కి భిన్నంగా పవర్ ఫుల్ లేడీ పోలీస్ రోల్ చేశారు. జనాలు మాత్రం హర్షించలేదు.
కెరీర్ సంగతి అలా ఉంటే… సోషల్ మీడియాను మాత్రం గ్లామర్ తో షేక్ చేస్తున్నారు. తరచుగా గ్లామర్ ఫోటోలు, హాట్ వీడియోలతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హిట్ నంబర్ కి మెస్మరైజింగ్ స్టెప్స్ వేసి అలరించింది. టైట్ ఫిట్ లో లావణ్య నడుము తిప్పుతూ టెంపరేచర్ పెంచేశారు. లావణ్య డాన్స్ వీడియో వైరల్ కాగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా లావణ్య ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రం చేస్తున్నారు. తెలుగులో ఆఫర్స్ తగ్గిన నేపథ్యంలో కోలీవుడ్ పై ఫోకస్ పెడుతున్నారు. ఇక కొన్నాళ్లుగా లావణ్య త్రిపాఠి టాలీవుడ్ యంగ్ హీరోతో లవ్ లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ వార్తలను లావణ్య పలుమార్లు ఖండించారు. ప్రస్తుతం తన ఫోకస్ ఓన్లీ కెరీర్ మీద అంటూ స్పష్టం చేశారు.
View this post on Instagram