Kerala High Court: మిగతా దేశాల్లో ఎలా ఉంటుందో తెలియదు గాని.. మనదేశంలో పబ్లిక్ గా అశ్లీల దృశ్యాలు చూడటం, చిత్రాలు వీక్షించడం నేరం. చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత.. అపరిమితమైన డేటా సౌకర్యం లభించిన తర్వాత అశ్లీల సైట్లు చూసే వారి సంఖ్య పెరిగిపోయింది. గూగుల్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అశ్లీల చిత్రాలు చూస్తున్న వారి సంఖ్యలో భారతీయులు కూడా ముందు వరుసలో ఉన్నారు. ఈ అశ్లీల చిత్రాలు చూడటం వల్ల యువత పెడ ధోరణి పడుతోందని, అందువల్ల అత్యాచారాలు వంటి నేరాలు పెరిగిపోతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాలంలో విరివిగా లభ్యమయ్యే అశ్లీల సైట్లను మనదేశంలో నిషేధించింది.
అయితే కేంద్రం నిర్ణయం ఈ విధంగా ఉంటే కేరళ హైకోర్టు మాత్రం ఒక విభిన్నమైన తీర్పు ఇచ్చింది. ప్రైవేట్ గా అశ్లీల చిత్రాలు చూడటం నేరం కాదని ఒకేసుకు సంబంధించిన తీర్పులో అభిప్రాయపడింది. ఒంటరిగా అశ్లీల చిత్రాలు చూసిన వారిపై ఐపిసి 292 కింద కేసు పెట్టలేరని వ్యాఖ్యానించింది. అశ్లీల చిత్రాలు, ఆ తరహా పుస్తకాల పంపిణీ, అమ్మకం, ప్రదర్శన చేస్తేనే ఈ సెక్షన్ ప్రకారం కేసు పెట్టడానికి వీలుంటుందని పేర్కొంది. అయితే ఇటీవల కేరళ రాష్ట్రంలో రోడ్డు పక్కన ఒక ముప్పై మూడు వేల యువకుడు ఒంటరిగా నిలబడి తన స్మార్ట్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తున్నాడు. సీసీ కెమెరాల ద్వారా ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని కేసు పెట్టారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది.
అశ్లీల చిత్రాలు చూడటం అనేది నేరమే. ఇక్కడ అతడి ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయాలను పోలీసులు ఎలా తప్పుగా పరిగణిస్తారని కోర్టు ప్రశ్నించింది. పోలీసులు అతనిపై కేసు పెట్టడం అంటే.. వ్యక్తిగత స్వేచ్ఛ లోకి ప్రవేశించడమే అని వ్యాఖ్యానించింది. ఎవరికి ఇబ్బంది లేకుండా తన ప్రైవేట్ టైంలో వాటిని చూడటం నేరం కాదని కోర్టు అభిప్రాయ పడింది. ఆశ్రిల చిత్రాలు శతాబ్దాలుగా ఉన్నవేనని, అయితే ఇంటర్నెట్ కారణంగా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలు పొరపాటున వాటిని చూడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించింది. పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెట్టుకొని ఉండాలని కోర్టు సూచనలు చేసింది. పిల్లలు అశ్లీల చిత్రాలు చూస్తుంటే వారిని వారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్లకుండా నిరోధించాలని, దానికి ఒకవేళ అశ్లీల చిత్రాలు కారణమైతే కచ్చితంగా వాటిని వారు చూడకుండా కఠినమైన నిబంధనలు విధించాలని సూచించింది. ఒక దేశ పౌరులు బాగుంటేనే ఆ దేశం బాగుంటుందని.. వారు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తుంటే అది అంతిమంగా దేశానికి కీడు చేస్తుందని కేరళ హైకోర్టు ప్రకటించింది.