Uttar Pradesh Husband And Wife: లోకంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మనకు ఇలాంటి విషయాలు కనిపిస్తుంటాయి. ప్రపంచంలో విభిన్న మనస్తత్వాలు గల మనుషులు ఉండటం సహజమే. కొన్ని వింతలు చూస్తుంటే మనకు నిజంగా ఆశ్చర్యమే కలుగుతుంది. ఆలుమగలు అన్నాక దాపరికాలు ఉండకూడదంటుంటారు. కానీ ఆ భార్యాభర్తలు గొడవ పడటంతో భర్త జీతం ఎంత వస్తుందో తెలుసుకోవాలని ఆమె అనుకుంది. అది సాధ్యం కాలేదు. దీంతో ఆమె ఆర్టీఐని ఆశ్రయించడమే సంచలనం కలిగిస్తోంది. కట్టుకున్న వాడి వేతనం ఎంతో తెలుసుకోవడానికి ఆమె నానా తంటాలు పడింది. చివరకు విజయం సాధించింది. భర్త సంపాదించే డబ్బు ఎంత అనే దానిపై ఎట్టకేలకు పట్టు సాధించడం విశేషం.

ఉత్తరప్రదేశ్ కు చెందిన సంజు గుప్తా అనే మహిళ ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోవడం సంచలనం కలిగించింది. ఆమె దరఖాస్తుకు స్పందించిన ఆర్టీఐ అధికారులు ఆ వివరాలు ఇవ్వలేమని చెప్పడంతో ఆమెకు పాలుపోలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా భర్త జీతం ఎంతో తెలుసుకోవాలని ఉత్సుకత ఆమెలో పెరిగింది. అధికారులేమో మొండిచేయి చూపించారు. దీంతో ఆమె అప్పిలేట్ అధికారిని ఆశ్రయించింది. అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. అయినా ఆమెలో సహనం నశించలేదు. తన భర్త సంపాదన గురించి తెలుసుకోవాలనే తపన ఇంకా ఎక్కువైంది.
Also Read: Adipurush Graphics: షాకింగ్..ఆదిపురుష్ సినిమాకి గ్రాఫిక్స్ డిజైన్ చేయించింది ఆ స్టార్ హీరోనా..?
దీంతో ఆమె కేంద్ర సమాచార కమిషన్ ను ఆశ్రయించింది. పదిహేను రోజుల్లోగా ఆమెకు భర్త జీతం వివరాలు ఇవ్వాలని తీర్పు ఇవ్వడంతో ఆమె విజయం సాధించినట్లు అయిది. భర్త వేతనం ఒక భార్య ఇంతటి పంతం పట్టడం పెద్ద వింతగా అనిపించింది. ఇలాంటి వారు కూడా ఉంటారా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. భర్త సంపాదించే జీతం ఎంతో తెలుసుకోవాలనే ఉత్సాహం ఆమెలో కసిని పెంచింది. అందుకే ఆమె భర్త వేతనం గురించి అంత తపన పడింది. మొత్తానికి విజయం సాధించింది.

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో ఆమె భర్త జీతం గురించి తెలుసుకోవాలని అనుకుంది. ఆమెకు చేదు అనుభవాలతో కుంగిపోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేసి కడకు భర్త సంపాదన తెలుసుకుంది. ఒక్కోసారి కొన్ని విషయాలు మనకు విచిత్రంగా అనిపించడం సర్వసాధారణమే. కానీ తన భర్త జీతం గురించి తెలుసుకునేందుకు ఆ ఇల్లాలు పడిన శ్రమ చూస్తే మనకు జాలేస్తోంది. ఇలా ఆమె ఎవరు ఏమనుకున్నాతన లక్ష్యం కోసం పనిచేసింది. భర్త సంపాదన గురించి గుట్టు దొరికించుకుని భర్తను ఎదిరించింది.
Also Read:Prabhas Health: ప్రభాస్ ఆరోగ్యానికి ఏమైంది అంటూ అభిమానుల ఆందోళన..వైరల్ అవుతున్న వీడియో
[…] Also Read: Uttar Pradesh Husband And Wife: భర్త జీతం తెలుసుకునేందుక… […]