Uttar Pradesh: ఇటీవల పెళ్లి రద్దుకు చిన్న చిన్న అంశాలు కారణమవుతున్నాయి. పెళ్లి నిశ్చయమై.. నేడో రేపో పెళ్లి పీటలెక్కాల్సిన సమయంలో వరుడు మద్యం తాగాడని ఒకరు.., నల్లగా ఉన్నాడని ఇంకొకరు.. పెళ్లి రద్దు చేసుకున్న ఘటనలు ఇటీవల జరిగాయి. తాజాగా ఓ యువతి తనకు కాబోయే వరుడు ప్రధాని ఎవరో చెప్పలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. అంతేకాదు.. అతని ముందే అతడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
మరదలు అడిగిన ప్రశ్నకు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. జరిగిన పెళ్లిని కాదని.. పెళ్లికొడుకు తమ్ముడిని ఓ యువతి వివాహం చేసుకుంది. శివశంకర్ (27)కు జూన్ 11న రంజనతో వివాహం జరిగింది. ఆరు నెలల క్రితమే వీరిద్దరి వివాహం నిశ్చయమైంది. జూన్ 12న ఉదయం.. పెళ్లివేడుకలో భాగంగా వధువు ఇంట్లో ఓ చిన్న కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో శివశంకర్ తన మరదలు, బావమరిదితో సరదాగా మాటలు కలిపాడు. ఉన్నట్టుండి మరదలు బావను ఓ ప్రశ్న వేసింది. అదేంటంటే దేశ ప్రధాని ఎవరని. ఆ ప్రశ్నకు శివశంకర్ సమాధానం చెప్పలేకపోయాడు.
హేళన చేశారని..
దేశ ప్రధాని ఎవరో యూడా శివశంకర్‌కు తెలియకపోవడంతో మరదలు, బావమరిదితోపాటు బంధువులు కూడా పక్కున నవ్వారు. హేళన చేశారు. ఆట పట్టించారు. దానికి శివశంకర్ ఏమీ ఫీల్ కాలేదు. కానీ పక్కనే ఉన్న నూతన వధువు మాత్రం అవమానంగా భావించింది. దేశ ప్రధాని ఎవరో కూడా తెలియని మొగుడు నాకొద్దని తెగేసి చెప్పింది. ఈ పెళ్లి క్యాన్సిల్ అని వెంటనే ప్రకటించింది.
వరుడి తమ్ముడితో పెళ్లి..
అయితే పెళ్లి క్యాన్సిల్ అయిందని బాధపడకుండా అక్కడే ఉన్న వరుడు శివశంకర్ తమ్ముడు అనంత్‌ను వెంటనే పెళ్లి చేసుకుంది రంజన. రంజన కంటే అనంత్ వయసులో చిన్నవాడు. అయినా పెళ్లికి అతను కూడా నిరాకరించలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కావాలనే రంజన అలా చేసి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నాడు. పెద్దల మాట కాదనలేక పెళ్లి చేసుకుందని, తర్వాత అతని తమ్ముడికి దగ్గరయి ఈ డ్రామా ఆడి ఉంటుందని భావిస్తున్నారు. నిశ్చితార్థానికి, పెళ్లికి ఎక్కువ సమయం ఉండడంతో రంజన వరుడి తమ్ముడిని లైన్‌లో పెట్టి ఉంటుందని, ఇద్దరూ కూడ బలుకుకునే ఇలా చేసి ఉంటారని మరికొంతమంది అంటున్నారు.