Uttar Pradesh Groom: కొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనగా వరుడికి కాబోయే అత్త షాకిచ్చింది. వధువును వివాహ మండపానికి తీసుకొచ్చే క్రమంలో డ్యాన్స్ చేసిన అత్త సిగరెట్ తాగుతూ కనిపించి కాబోయే అల్లుడికి షాకిచ్చింది. ఈ పరిణామంతో మనస్తాపానికి గురైన వరుడు తాను పెళ్లి చేసుకోనని మొండికేశాడు. ఉత్తరాధిలో జరిగే వివాహాలు భిన్నంగా ఉంటాయి. వివాహానికి ముందు చాలా రకాల తంతులు జరపుతారు. హల్లీ, మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలతో విందు, పసందులు జరుపుకుంటారు. మగ, ఆడ అన్న తేడా లేకుండా స్టెప్పులు వేస్తారు. అయితే అత్త ఇలా సిగరెట్ తాగుతూ కనిపించేసరికి అల్లుడు తట్టుకోలేకపోయాడు. పెళ్లి వద్దని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. చివరకు ఇరువర్గాల బంధువులు పంచాయితీ చేసి పెళ్లి పీటలెక్కించారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన సంభాల్ జిల్లాకు చెందిన వరుడు, రాజ్ పురాకు చెందిన వధువుకు జూన్ 27న వివాహం నిశ్చయించారు. ఓ కళ్యాణ మండపంలో వివాహానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. వరుడితో పాటు ఆయన తరుపున బంధువులు ముందుగానే విచ్చేశారు. అనంతరం వధువును తీసుకొచ్చే క్రమంలో పల్లకి ముందు ఆడపిల్ల బంధువులు, కుటుంబసభ్యలు డ్యాన్స్ లతో హోరెత్తిస్తున్నారు. అదే సమయంలో వధువు తల్లి సిగరెట్ తాగుతూ వరుడి కంట పడింది. దీంతో కోపోద్రిక్తుడైన వరుడు తనకు పెళ్లివద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇరు వర్గాల పెద్దలు కలుగజేసుకొని నచ్చజెప్పి యధావిధిగా పెళ్లి జరిపించారు.
ఇటీవల పార్టీ కల్చర్ పెరిగింది. పల్లెలకు సైతం పాకింది. వివాహాలు, ఊరేగింపుల్లో మహిళలు సైతం డ్యాన్స్ చేస్తున్నారు. గతంలో ఇటువంటి సంస్కృతి ఉండేది కాదు. మహిళల భాగస్వామ్యం కూడా తక్కువే. కానీ పాశ్చత్యా ధోరణులతో మహిళలు ఇటువంట వేడుకల్లో పాల్గొంటున్నారు. స్వేచ్ఛగా, ఎటువంటి భయం లేకుండా వ్యవహరిస్తున్నారు.