
Hero Govinda: సినిమాకు మించిన నాటకీయత నిజ జీవితంలో చోటుచేసుకుంటుంది. కొన్ని సంఘటనల గురించి వింటే అసలు నమ్మ బుద్ధి కాదు. ఒక అభిమాని చేసిన సాహసం వింటే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. బాలీవుడ్ హీరో గోవింద అభిమాని మారు వేషంలో పనిమనిషిగా ఆయన ఇంటికి వచ్చిందట. గతంలో జరిగిన ఈ సంఘటనను ఓ సందర్భంలో గోవింద మీడియాకు తెలియజేశారు. ఆ సంఘటన గురించి వివరిస్తూ… మా ఇంటి వద్ద వేచి ఉన్న ఒక అమ్మాయిని నేను చూశాను. ఎందుకు ఇక్కడ ఉన్నావ్? అంటే నాకు పని కావాలని అడిగింది. ఈ వ్యవహారాలు మా అమ్మ చూసుకుంటుంది, ఆవిడను కలవమని చెప్పాను.
ఆమె ఏం చెప్పిందో నాకు తెలియదు. అమ్మ ఆ అమ్మాయికి పనిచ్చింది. చూస్తే ఆ అమ్మాయికి ఇంటి పని చేయడం వచ్చేది కాదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా యాక్టీవ్ గా పనులు చూసుకునేది. ఈ మార్పు మా ఆవిడ సునీత గుర్తించింది. ఆ పని అమ్మాయి ప్రవర్తన మీద సునీతకు సందేహం కలిగింది. ఈ అమ్మాయి ఏదో దాస్తుందని గ్రహించింది. ఒక రోజు వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడుతుంటే సునీత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అప్పుడు నువ్వు ఎవరని వివరాలు అడిగితే, ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయి.

ఆ అమ్మాయి ధనవంతుల కుటుంబంలో పుట్టింది. వాళ్లకు ఏకంగా 8 కార్లు ఉన్నాయట. అంత గొప్పింటి పిల్ల… కేవలం నా మీద అభిమానంతో పని మనిషిగా మారింది. మా ఇంట్లో ఉంటే నన్ను చొడొచ్చు, సమయం గడపవచ్చు అన్న ఆలోచనతో పని మనిషి వేషంలో ఇంటికి వచ్చిందని గోవింద, ఆయన భార్య సునీత తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు సినిమాల్లో మాత్రమే చూస్తాం… కానీ నిజ జీవితంలో ఒక కోటీశ్వరురాలైన అమ్మాయి, పని మనిషి అవతారం ఎత్తింది.
1986లో గోవింద హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 90ల వరకు టాప్ స్టార్ గా ఆయన బాలీవుడ్ ని ఏలారు. గోవింద డాన్స్, కామెడీ టైమింగ్, సహజ నటన విపరీతమైన ఫ్యాన్ బేస్ తెచ్చిపెట్టాయి. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా గోవిందా వెలిగిపోయాడు. కాగా సునీతా అహుజాను గోవిందా రహస్య వివాహం చేసుకున్నారు. పెళ్ళైన ఏడాదికి 87లో కూతురు పుట్టాక తన పెళ్లి మేటర్ లీక్ చేశారు. పెళ్ళైన హీరో అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుందన్న భయంతో పెళ్లి విషయం దాచినట్లు గోవిందా ఓ సందర్భంలో వెల్లడించారు.