Homeఎంటర్టైన్మెంట్The Elephant Whisperers Oscar: ఎటువంటి హంగామా లేకుండా ఆస్కార్ కొట్టేసిన The Elephant Whisperers

The Elephant Whisperers Oscar: ఎటువంటి హంగామా లేకుండా ఆస్కార్ కొట్టేసిన The Elephant Whisperers

The Elephant Whisperers Oscar
The Elephant Whisperers Oscar

The Elephant Whisperers Oscar: ఆస్కార్ అవార్డు దక్కడం అంటే ప్రపంచ విజేతగా నిలిచినట్లే.. ఈ అవార్డు కోసం ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేసిన వారున్నారు. కొందరు దశాబ్దాల కొద్దీ సినీ ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేస్తే గానీ దీనిని సొంతం చేసుకోలేదు. ఈ ప్రయోగాలన్నీ హాలీవుడ్ కే సాధ్యం కాబట్టి ఎక్కువగా వారికే ఇవి సొంతం అవుతాయని ఒకప్పుడు అనుకునేవారు. కానీ అద్భుత సినిమాలు ఏ మూలన ఉన్నా ఆస్కార్ నడుచుకుంటూ వస్తుందని కొన్ని మూవీస్ నిరూపిస్తున్నాయి. తాజాగా జరిగిన ‘ఆస్కార్ 95’లో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో తెలుగు సినిమా ‘నాటు నాటు’ సాంగ్ గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇండియన్ కు చెందిన మరో మూవీ The Elephant Whisperers కూడా డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డు వచ్చే వరకు ఈ సినిమా ఒకటి ఉందన్న విషయం చాలా మంది ఇండియన్స్ కే తెలియదు. కానీ ప్రపంచం గుర్తించింది. ఏమాత్రం హడావుడి లేకుండా సైలెంట్ గా అవార్డు కొట్టిన దీని విశేషాలు మీకోసం..

The Elephant Whisperers ను తమిళనాడుకు చెందిన కార్తీకి గోన్సాల్వేస్ తీశారు. గునీత్ మెంగా దీనిని నిర్మించారు. వాస్తవానికి కార్తీకి గోన్సాల్వేస్ కు ఇది మొదటి సినిమా. తొలి సినిమాతోనే ఆమె ఆస్కార్ వరకు వెళ్లి చరిత్ర సృష్టించారు. ఆస్కార్ గెలుచుకున్న కార్తీకి మాట్లాడుతూ తమ చిత్రాన్ని గుర్తించినందుకు, భారతదేశానికి పట్టం కట్టినందుకు, జంతువులను హైలెట్ చేసిందుకు ధన్యవాదాలు అని చెప్పారు. మానవులు, జంతువుల మధ్య ఎటువంటి ప్రేమ ఉంటుందో మా సినిమా ద్వారా చెప్పామని, దానిని ఆదరించినందుకు థ్యాంక్స్ చెప్పారు.

The Elephant Whisperers Oscar
The Elephant Whisperers Oscar

ది ఎలిఫెంట్ విస్పర్స్ కథ విషయానికొస్తే.. కొన్నేళ్ల కిందట తమిళనాడులోని నీలగిరి అడవుల్లో ఓ గున్న ఏనుగు తల్లి నుంచి తప్పిపోయింది. ఈ గున్న ఏనుగు గాయాలతో కనిపించింది. దీనిని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఇది బతకడం కష్టం అని వదిలేశారు. కానీ ఆదివాసీలైన బెల్లి, బొమ్మన్ అనే దంపతులు దీనిని ఆదరించారు. వారు ఆ గున్న ఏనుగును కాపాడి తమ బిడ్డలాగా చూసుకున్నారు. ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుగు మధ్య ఏర్పడిన ప్రేమానుబంధాలను కార్తీకి గోన్సాల్వేస్ తన డాక్యమెంటరీ ద్వారా చూపించారు. స్వచ్ఛమైన అడవిలో స్వచ్ఛమైన మనుషులు ఉంటారని, వారి భావోద్వేగాలకు ఎవరైనా పడిపోవాల్సిందేనని ఈ సినిమా ద్వారా ఆమె నిరూపించారు.

The Elephant Whisperers ను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాకు పెద్దగా ఆదరణ రాలేదు. కొంత మంది జంతు ప్రేమకులు తప్ప సాధారణ జనాలు యాక్సెప్ట్ చేయలేదన్న ప్రచారం సాగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా The Elephant Whisperers ను ఆదరించారని ఆ తరువాత అర్థమైంది. 2023 ఆస్కార్ కోసం ఎంపిక చేసిన చిత్రాల్లో ది ఎలిఫెంట్ విస్పర్స్ నామినేట్ అయిందన్న విషయం కూడా బయటకు రాలేదు. కానీ ఏకంగా అవార్డును సొంతం చేసుకోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా The Elephant Whisperers గురించే మాట్లాడుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయినప్పటి నుంచి నేటి వరకు ప్రతిరోజూ ఏదో ఒక న్యూస్ జనాల్లోకి వెళ్లింది. కానీ The Elephant Whisperers పై ఒక్క వార్త కూడా రాకపోవడం విశేషం. ఈ సందర్భంగా కొందరు అద్భుతాలు జరగాలంటే హడావుడి అవసరం లేదని సినీ ప్రేమికులు కీర్తిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిభగల సినిమాల కోసం ఆస్కార్ అవార్డు నడుచుకుంటూ వస్తుందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version