Homeట్రెండింగ్ న్యూస్Karnataka: చావుకు కారణమైన కుక్క.. వెతుక్కుంటూ ఇంటికొచ్చి రోదించింది.. కదిలిస్తున్న ఘటన

Karnataka: చావుకు కారణమైన కుక్క.. వెతుక్కుంటూ ఇంటికొచ్చి రోదించింది.. కదిలిస్తున్న ఘటన

హొన్నాలి తాలూకా క్యానికరే నుంచి అనవేరికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తిప్పేస్ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ కు అడ్డంగా కుక్క రావడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర గాయాల పాలయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

Karnataka: తన కారణంగా ఓ యువకుడు మృతి చెందాడని శునకం తట్టుకోలేకపోయింది. జరిగిన ఘటనను తలుచుకొని కన్నీరు మున్నీరయింది. సదరు యువకుడి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి తన బాధను వ్యక్తం చేసింది. యువకుడి తల్లిదండ్రుల వద్ద కూర్చుని కన్నీరు కార్చింది. ఆ మూగ బాధ ఆసక్తికరంగా మారింది. తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరెలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

హొన్నాలి తాలూకా క్యానికరే నుంచి అనవేరికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తిప్పేస్ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ కు అడ్డంగా కుక్క రావడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర గాయాల పాలయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రమాదానికి కుక్కే కారణమని స్థానికులు నిందిస్తూ వస్తున్నారు.

అయితే తిప్పేస్ మరణించిన మూడో రోజుకు వారి ఇంటిని వెతుక్కుంటూ ఒక కుక్క వచ్చింది. తిప్పేస్ తల్లిదండ్రులకు వద్దకు వెళ్లి కొద్దిసేపు కూర్చుంది. ఆ కుక్క కళ్ళ వెంబడి కన్నీరు కార్చింది. దీంతో అక్కడున్న వారు షాక్ కు గురయ్యారు. బైక్ ప్రమాదానికి ఆ కుక్కే కారణమని గుర్తించారు. ఇంట్లో అన్ని గదులు కలియ తిరుగుతూ.. మృతుడి తండ్రి వద్దకు వెళ్లి కుక్క కన్నీరు కార్చడం మానవతను తట్టి లేపింది. దీంతో కుక్కను అనునయించాల్సి వచ్చింది. కొద్దిసేపు అక్కడే ఉంటూ విపరీతమైన మూగబాధను వ్యక్తం చేసింది. దీంతో ఆ కుక్క పరిస్థితిని చూసి స్థానికులు సైతం బాధపడ్డారు. ఆ మూగ జీవి పశ్చాత్తాపం వ్యక్తం చేసిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper