
Upasana Delivery Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం #RRR సినిమాతో తనకి వచ్చిన గ్లోబల్ స్టార్ ఇమేజి ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు.అమెరికా లో #RRR సినిమాకి సంబంధించి వస్తున్నా అన్నీ అవార్డ్స్ లో తళుక్కుమని మెరుస్తున్నాడు.మన ఇండియన్ సినిమాకి ప్రెజెంటర్ గా అంతర్జాతీయ ఈవెంట్స్ లో రామ్ చరణ్ నిలుస్తూ తెలుగోడి సత్తా ఏమిటో అందరికీ అర్థం అయ్యేలా చేసాడు.
ఇప్పటికే HCA అవార్డ్స్ లో హాలీవుడ్ సినిమాలకు ‘బెస్ట్ వాయిస్/ మోషన్ కాప్చర్’ అవార్డుని అందచేసే అరుదైన అదృష్టం ని దక్కించుకున్న రామ్ చరణ్, ఆయన అభిమానులను మాత్రమే కాదు, ప్రతీ ఇండియన్ సినిమా అభిమానిని గర్వపడేలా చేసాడు.ఆ తర్వాత ఈవెంట్ లో ఆయనకీ స్పాట్ లైట్ అవార్డు కూడా దక్కింది,ఇలా ఏ ఇండియన్ కి దక్కని అరుదైన గౌరవాలను దక్కించుకున్న రామ్ చరణ్, ఈ నెల 12 వ తారీఖున జరగబొయ్యే ‘ఆస్కార్’ అవార్డ్స్ ఈవెంట్ లో కూడా పాల్గొనబోతున్నాడు.
ఇదంతా పక్కన పెడితే త్వరలోనే ఆయన తండ్రి కూడా కాబోతున్నాడు..గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆనందంతో ఈ విషయాన్నీ తెలియచేసాడు.మొన్న జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ ఇంటర్వ్యూస్ లో దీని గురించి మాట్లాడుతూ ‘డెలివరీ డేట్ ఇంకా రాలేదు, ఆగష్టు లో వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను..ఎందుకంటే ఆ నెలలోనే నా పుట్టిన రోజు కూడా ఉంది’ అంటూ మురిసిపోతూ చెప్పాడు.

ఏ ముహూర్తం లో చెప్పాడో కానీ, అది ఇప్పుడు నిజం అవ్వబోతుంది.ఉపాసన కి ఆగస్టు 20 వ తేదీన డెలివరీ చేస్తునట్టు వార్తలు ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్.చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22 వ తారీఖున అనే విషయం అందరికీ తెలిసిందే.సరిగ్గా రెండు రోజుల ముందు రామ్ చరణ్ బిడ్డ ఈ భూమి మీద అడుగుపెట్టబోతుంది అన్నమాట.ఫ్యాన్స్ కి ఇది నిజంగా పండుగ లాంటి వార్త అనే చెప్పాలి.
