Anakapalli: చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు. కానీ వీటిని తినడం కష్టంగా ఉంటుంది. అయినా కొన్ని ప్రత్యేక రోజుల్లో చేపలు తినేందుకు ఎగబడుతుంటారు. అయితే అప్పడప్పుడు అరుదైన చేపలు తారసపడుతూ ఉంటాయి. వీటి ఖరీదు కోట్లల్లో ఉంటుంది. ఒక్క చేప కోసం ఇంత మొత్తం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అని చాలా మందికి సందేహం వస్తుంది. అయితే అందులో ఉండే ఔషధ గుణాలే కారణమని కొందరి ద్వారా తెలుస్తోంది. తాజాగా అలాంటి చేప ఒకటి సముద్రంలో జాలర్ల వలకు చిక్కింది. భారీ సైజులో ఉన్న ఈ చేప ఖరీదు ఏకంగా రూ.3.90 లక్షలు పలికింది. దీని బరుకు 27 కేజీలు.. అయినా దీని ధర ఇంతగా పలకడానికి కారణం ఉంది. ఆ విశేషాల్లోకి వెళితే..
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో మత్స్యకారుల వలలో భారీ చేప చిక్కింది. దీనిని కచిడి చేపగా గుర్తించారు. అచ్చుతాపురం మండలం పూడిమడక గ్రామ శివారులో మత్స్యకారులు సోమవారం చేపల వేటకు వెళ్లగా ఇది చిక్కింది. ఈ చేపను కొనేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. మత్స్యకారుడు మేరుగు నూకయ్యకు చెందిన ఈ చేపను చేపల వ్యాపారి మేరుగు కొండయ్య రూ.3.90 లక్షలు చెల్లించి దక్కించుకున్నాడు. అయితే ఈ చేపకు అంత ఖరీదు చెల్లించడానికి కారణమేంటని ఆసక్తి గా చర్చంచుకుంటున్నారు.
ఈ తరుణంలో కొందరు చేప గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చేపలో విశేష ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తింటే ఎలాంటి రోగాలు ఉన్నా మాయమవుతాయని అంటున్నారు. ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేసేటప్పుడు కుట్లు వేసిన తరువాత దారం ఉంటుంది కదా.. దానిని ఇలాంటి చేపతోనే తయారు చేస్తారని అంటున్నారు. అలాగే ఔషధాల తయారీలోనూ దీనిని ఉపయోగిస్తారట. ఇలాంటి చేపలు ఎక్కువగా సముద్రంలో నుంచి బయటపడుతాయని,ఇవి ఎప్పుడు బయటకొచ్చినా.. లక్షల్లో ధర పలుకుతుందని చెబుతున్నారు.
గోల్డెన్ షిప్ గా పేరొందిన ఈ చేప గురించి సోషల్ మీడియాలో వైర్ కావడంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సాధారణంగానే చేపలు ఆరోగ్యానికి మంచివి. ఎలాంటి కొలెస్ట్రాల్ లేకుండా అనేక రకాల ఖనిజాలు లభ్యమవుతాయి. అలాంటిది ఇటువంటి చేప లభ్యం కావడంతో దానిని కొనాలని ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అయితే ఎప్పుడోసారి మాత్రమే ఇది వలలో చిక్కుతుందని జాలరులు పేర్కొటున్నారు.