Biscuit
Biscuit: యే.. బిస్కేట్… ఎవరైనా గొప్పలు చెప్పుకునా.. పొగిడినా.. ఈ పదం వాడడం ఈ మధ్య కామన్ అయింది. అయితే ఓ బిస్కెట్ కంపెనీ కస్టమర్లకు బిస్కేట్ వేసింది. లేబుల్‌పైన ఒకలా రాసి.. లోపల ఒకలా ఉంచి కస్టమర్లకు విక్రయిస్తోంది. దీనిని గుర్తించిన ఓ వినియోగదారుడు కోర్టును ఆశ్రయించాడు. కస్టమర్లకు బిస్కేట్ వేస్తూ వస్తున్న సదరు కంపెనీకి భారీ జరిమానా విదించింది. బిస్కెట్టే కదా అని వదిలేస్తే.. పోయే దానిని కోర్టుకు ఈడ్చి.. రూ.లక్ష జరిమానా రాబట్టడం ఇస్పుడు చర్చనీయాంశమైంది.
తమిళనాడులో..
తమిళనాడులో వింత ఘటన చోటు చేసుకుంది. తాను కొనుగోలు చేసిన బిస్కెట్ ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తక్కువగా ఉండటంతో కొనుగోలుదారుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్యాకెట్‌లో 16 బిస్కెట్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 15 బిస్కెట్లు మాత్రమే రావడంతో తమిళనాడులోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. వ్యక్తి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కోర్టు సదరు బిస్కెట్ కంపెనీ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది.
ప్రముఖ కంపెనీ..
తమిళనాడు రాష్ట్రం చెన్నై మణలి సమీపంలోని మాత్తూరు ఎంఎండీఏకి చెందిన ఢిల్లీ బాబు అనే వ్యక్తి 2021 డిసెంబర్ నెలలో సన్‌ఫీస్ట్ మేరీలైట్ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. అందులో 16 బిస్కెట్లు ఉండాల్సి ఉంది. కానీ, 15 మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని దుకాణదారుడు, బిస్కెట్ తయారీ సంస్థ ఐటీసీకి తెలియజేయగా స్పందన రాలేదు.
దబాయించడంతో..
ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ మాత్రమేగా తక్కువగా వచ్చింది.. దాని వల్ల ఇబ్బంది ఏమిటి.. బరువు తగ్గలేదు అంటూ సంస్థ సిబ్బంది దబాయించడంతో ఢిల్లీబాబుకు కోపం వచ్చింది. ఎలాగైనా వీరికి బుద్ధిచెప్పాలని అనుకున్నాడు. దీంతో తిరువళ్లూరులోని వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశాడు.
నిత్యం 50 లక్షల బిస్కెట్ల తయారీ..
సన్‌ఫీస్ట్ బిస్కెట్ తయారీ సంస్థ రోజుకు సుమారు 50 లక్షల బిస్కెట్లు తయారు చేస్తొంది. ఒక్కో బిస్కెట్ ఖరీదు రూ.75 పైసలు. ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తగ్గించడం వల్ల రోజుకు రూ.29 లక్షల మోసానికి సంస్థ పాల్పడుతుందని కోర్టుకు నివేదించాడు. ఎఫ్‌ఎంసీజీ కంపెనీ, బిస్కెట్ ప్యాకెట్‌ను విక్రయించిన దుకాణం నుంచి రూ.100 కోట్ల జరిమానా విధించాలని ఢిల్లీ బాబు తన ఫిర్యాదులో కోరాడు. అన్యాయమైన వాణిజ్య, సేవ లోపానికి పాల్పడినందుకు పరిహారంగా మరో రూ.10 కోట్లు డిమాడ్చేశారు.
బరువు తగ్గలేదని..
అయితే, బిస్కెట్ తయారీ సంస్థ మాత్రం.. ప్యాకెట్‌లో బిస్కెట్ల సంఖ్యను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టును కోరింది. లీగల్ మెట్రాలజీ 2011 నియమాల ప్రకారం ప్యాక్ చేయబడిన వస్తువులకు గరిష్టంగా 4.5 గ్రాముల వరకు లోపాలను అనుమతిస్తుందని ఐటీసీ తన వాదనలో వివరించింది. అయినా దీనికి న్యాయమూర్తి అంగీకరించలేదు. ఈ నియమం అస్థిరంగా ఉండే వస్తువులకు మాత్రమే వర్తిస్తుందని కమిషన్ వివరించింది.
రూ.లక్ష జరిమానా.. ఖర్చులకు రూ.10వేలు..
కోర్టు ఢిల్లీ బాబు వాదనలను పరిగణలోకి తీసుకుంది. ఢిల్లీ బాబుకు రూ. లక్ష జరిమానా చెల్లించాలని ఐటీసీ సంస్థకు వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వ్యాజ్యానికి అయ్యే ఖర్చులకు రూ. 10 వేలు ఇవ్వాలని వినియోగదారుల ఫోరం బిస్కెట్ తయారీ కంపెనీని ఆదేశించింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The consumer court ordered the itc to pay rs 1 lakh to the person found short of one biscuit in the packet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com