Naga chaitanya – Sobhita : అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. చై హీరోగా ఎంట్రీ ఇచ్చి రీసెంట్ గా 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. జోష్ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని అందగాడు, ఆ సినిమాతో హిట్ సాధించకపోయినా కానీ తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు.
నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్ళు కావడంతో సోషల్ మీడియాలో చైతూ గురించి పోస్టులు బాగా కనిపిస్తున్నాయి, అదే సమయంలో అతనికి సంబంధించిన మరో న్యూస్ కూడా హల్చల్ చేస్తుంది. సమంత తో విడాకులు తీసుకున్న నాటి నుంచి నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ తో రిలేషన్ లో ఉన్నాడని, ఆమెతో అనేక విహారయాత్రలు చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.
గతంలో ఒక రెస్టారెంట్ లో వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఒకటి ఆన్లైన్ లో దర్శనం ఇవ్వడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. దీనిపై ఇప్పటికే శోభిత వివరణ ఇచ్చిన కానీ నాగ చైతన్య నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక రీసెంట్ గా ఒక బుక్ ద్వారా వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ మరోసారి బట్టబయలు అయ్యింది. కావాలని చేశారో లేక కో ఇన్సిడెంట్ గా జరిగిందో కానీ ఇప్పుడు ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.
కొద్ది క్రితం చైతన్య గ్రీన్ లైట్ అనే బుక్ గురించి చెబుతూ ” జీవితానికి ఒక ప్రేమ లేఖ. మీ ప్రయాణాన్ని మాతో పంచుకుందుకు మాధ్యు మాక్కనౌకే కు థాంక్యూ .. ఈ పఠనం నాకు గ్రీన్ లైట్ నింపింది. రెస్పెక్ట్ సర్ ” అంటూ పోస్ట్ చేశాడు. రీసెంట్ అదే బుక్ ను శోభిత షేర్ చేస్తూ “గత కొన్ని నెలల్లో నేను చదివిన అత్యుత్తమ పుస్తకం. ఎంతో అపురూపమైన కథ. ఒక పాట లాగా, నిజంగా విపరీతమైన నవ్వు మరియు స్వాతంత్య్రాన్ని సంపాదించిన రుచిగా ఉంది” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పుస్తకం చై రిఫర్ చేశాడా ? లేక గిఫ్ట్ ఇచ్చాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి