Uttar Pradesh: “ఈ రేయి తీయనిది. ఈ చిరుగాలి మనసైనది. ఈ హాయి వెచ్చనిది.. అని పాడుకుంటూ.. భార్య ఒడిలో సేద తీరుకుంటూ.. కొంటె కబుర్లు చెప్పుకుంటూ.. తొలిరాత్రి గడపాలి. తొలిరేయినాడు విజృంభించకూడదు.. మరుసటినాడు చింతించకూడదు” అని అంటారు పెద్దలు. కానీ ఈ మాటలు అతడు లక్షపెట్టలేదు. పైగా ఏదో ముప్పు ముంచుకొచ్చిన తీరుగా వ్యవహరించాడు.. తర్వాత ఏం జరిగిందో.. చెప్పాల్సిన పని ఏముంది.. చదివేయండి..
అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. హమీర్ పూర్ ప్రాంతం.. ఈ ప్రాంత పరిధిలో ఉరై గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన ఓ ఇంజనీర్ ఈనెల మూడున ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. యువతీ తరఫున వాళ్లు పెళ్లిని ఘనంగా జరిపించారు. వరుడు కూడా తన ఇంట్లో వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నాడు. ఇక అన్ని తంతులు పూర్తి అయిన తర్వాత ఆఖరి ఘట్టం రానే వచ్చింది. ఫిబ్రవరి 7వ తేదీన వరుడు ఇంట్లో నూతన దంపతులకు శోభనానికి సంబంధించి పెద్దలు ఏర్పాట్లు చేశారు. అయితే తొలి రాత్రిలోనే ఎక్కువ సుఖం పొందాలనుకున్న ఆ వరుడు.. “ఆ” సామర్థ్యాన్ని పెంచే మాత్రలు వేసుకున్నాడు.
మాత్రలు వేసుకున్న తర్వాత భార్యతో సంసారం చేశాడు. దీంతో వధువుకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ఈ విషయాన్ని అతడు కుటుంబ సభ్యులకు చెప్పడంతో హుటాహుటిన వారు ఆమెను కాన్పూర్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 10న ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వరుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా తమ కుమార్తె మరణానికి కారణమైన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా పెళ్లయిన ఆ యువకుడు చేసిన అతి వల్లే ఆ యువతికి తీవ్రంగా రక్తస్రావం జరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ” ఆ” సామర్థ్యాన్ని పెంచే మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల.. యువతితో ఎక్కువగా సంసారం చేశాడని.. దానివల్ల ఆ యువతి కి తీవ్రంగా రక్తస్రావం జరిగిందని కాన్పూర్ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు అంటున్నారు. కాగా, ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది.