https://oktelugu.com/

Smoke Kiss: ఇదేం పత్యం? పొగ తాగుతూ వధూవరులు లిప్ కిస్.. వీడియో వైరల్..

సాధారణందా ధూమపానం, హుక్క తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూ ఉంటారు. కానీ ఓ జంట మాత్రం ఏకంగా పెళ్లి మండపంలోనే పొగతాగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 20, 2023 / 05:22 PM IST

    Smoke Kiss

    Follow us on

    Smoke Kiss: ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఈ వేడుకను వైభవంగా నిర్వహించుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. బంధువులు, స్నేహితులు దాదాపు ఊరంతా పిలుచుకొని రుచికరమైన భోజనాలు పెడుతూ ఉంటారు. అయితే నేటి పెళ్లిళ్లు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు వారం రోజులు జరిగే తంతు ఇప్పుడు, కేవలం 2 లేదా 3 రోజుల్లోనే ముగించేస్తారు. అయితే మరికొందరైతే ఒకే రోజు అన్నీ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. కానీ నేటి కాలంలో పెళ్లికి ముందు వధూవరులు వెడ్డింగ్ ఫొటో షూట్ తీసుకోవడం ఫ్యాషన్ గా మారింది. పేద, ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వెడ్డింగ్ షూట్ తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

    ఈ క్రమంలో కొందరు హద్దులు దాటుతున్నారు. చేయకూడని పనులు చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను భట్టి చూస్తే..రోడ్డుపై బురదలో.. సముద్రంలో ఇలా ఎక్కడ పడితే అక్కడ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. వెడ్డింగ్ షూట్ మొదలైన కొత్తల్లో పచ్చని ప్రదేశంలో.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫొటోలు దిగేవారు. కానీ ఇప్పుడు వినూత్న పద్ధతిలో ఫొటోలకు, వీడియోలకు ఫోజు లిస్తున్నారు. తాజాగా వధూవరులిద్దరూ పెళ్లి మండపంలో చేయకూడని పని చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

    సాధారణందా ధూమపానం, హుక్క తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూ ఉంటారు. కానీ ఓ జంట మాత్రం ఏకంగా పెళ్లి మండపంలోనే పొగతాగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ముందుగా వరుడు హుక్కాకు సంబంధించిన పొగను నోట్లో పీల్చుకొని ఆ తరువాత వధువు నోట్లో వదులుతాడు. వధువు సైతం తనకు ఇష్టమే అన్నట్లు నోరు తెరిచి మరీ ఆస్వాదిస్తుంది. ఇలా ఇద్దరూ ఒకరికొకరు ముద్దు పెట్టుకునే క్రమంలో దగ్గరగా ఒకరికొకరు పొగను వదులుతూ ఉంటారు.

    ఇందుకు సంబందించిన వీడియో ఇన్ స్ట్రాగ్రామ్ లో వైరల్ అయింది. అయితే ఈ వీడియోపై చాలా మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. శుభ్రంగా పెళ్లిళ్లు చేసుకునేవారు ఇదేమీ పత్యానికి ఒడిగట్టారు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మ్యారేజ్ కు వచ్చిన వాళ్తంతా వధూవరులను ఆశీర్వదించే బదులు తిట్టిపోస్తున్నారు. వందల మంది వచ్చే మ్యారేజ్ ఫంక్షన్లో ఇలాంటి పనులు చేస్తారా? అని అంటున్నారు.