
Hero Warning to Rajamouli : రాజమౌళి విన్నింగ్ మిషన్. ఆయన నుండి సినిమా వస్తుంది అంటే జయాపజయాల గురించి ఎవరూ మాట్లాడుకోరు. కేవలం రికార్డుల గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. ఎంత పెద్ద హీరో నటించినా అది రాజమౌళి సినిమా అంటారు. అంతగా ఆయన డామినేషన్ ఉంటుంది. ఇక సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తారు. మేకింగ్ నుండి మార్కెటింగ్ వరకు ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటారు. రాజమౌళి సక్సెస్ సీక్రెట్ కూడా అదే.
ఇక రాజమౌళితో మూవీ చేసే ఛాన్స్ వచ్చిందంటే ఆ హీరోకి ఒక బ్లాక్ బస్టర్ పడ్డట్లే. కొన్ని రికార్డులు నమోదు చేసుకున్నట్లే. ఈ క్రమంలో రాజమౌళితో పని చేయాలని చాలా మంది కోరుకుంటారు. తమ వారసులను రాజమౌళి మూవీలో నటింపజేయాలని ఆశపడతారు. అలాగే ఓ బడా నటుడు రాజమౌళి దగ్గరకు తన ప్రపోజల్ తీసుకెళ్లారట. మా అబ్బాయితో ఒక మూవీ చేయండని అడిగారట.
ఆ ఆఫర్ ని రాజమౌళి సున్నితంగా తిరస్కరించారట. దాంతో ఆ హీరో రాజమౌళి మీద ఫైర్ అయ్యాడట. పరిశ్రమలో ఎలా ఉంటావో చూస్తా? నీ అంతు చూస్తా! అని వార్నింగ్ లు ఇచ్చాడట. రాజమౌళి కూడా తగ్గకుండా నీ కొడుకులో హీరో అయ్యే లక్షణాలు లేవు. రాణించడని అన్నాడట. రాజమౌళి చెప్పినట్లే ఆ వారసుడు పరిశ్రమలో ఎక్కిరాలేదు. వరుస ప్లాప్స్ తో రేసులో వెనుకబడ్డాడట. ఈ మేరకు ఓ వాదన పరిశ్రమలో ఉంది.
రాజమౌళి ఒకసారి పని చేసిన వాళ్లతో పదేపదే చేస్తుంటారు. ఆయన టెక్నీషియన్స్ కూడా మారరు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన టీమ్ లో కచ్చితంగా ఉంటారు. ఇప్పటి వరకు రాజమౌళి 12 సినిమాలు చేశారు. వాటిలో అత్యధికంగా ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు చేశారు. తర్వాత ప్రభాస్ తో మూడు, రామ్ చరణ్ తో రెండు సినిమాలు చేశాడు. మరో హీరోని ఆయన రిపీట్ చేయలేదు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో అసలు ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం మహేష్ తో చేస్తున్నారు .