
Ravi Teja’s Shocking Comments : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’.మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఈ సినిమా దాదాపుగా 130 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెగాస్టార్ ని మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించింది ఈ చిత్రం.చాలా కాలం తర్వాత చిరంజీవి లో కామెడీ యాంగిల్ ని చూడడం వల్ల ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే మాస్ మహారాజా రవితేజ పాత్ర కూడా ఈ సినిమాకి పెద్ద హైలైట్ గా నిల్చింది.విక్రమార్కుడు సినిమా తర్వాత ఆయనకీ అంతటి పవర్ ఫుల్ పాత్ర దక్కింది ఈ సినిమాతోనే.అప్పుడే ‘ధమాకా’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఊపు మీదున్న రవితేజ కి వెంటనే ‘వాల్తేరు వీరయ్య’ రూపం లో మరో సూపర్ హిట్ రావడం విశేషం.

ఇప్పుడు ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రావణాసుర’ ఈ నెల 27 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సందర్భంగా రవితేజ ఇప్పుడు ప్రొమోషన్స్ లో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు.ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ రవితేజ తో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేసాడు.ఈ సందర్భంగా రవితేజ ని ‘వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి గారి పక్కన నటించే అవకాశం వచ్చింది.మీ పాత్ర తగ్గిపోతుంది అనే ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ మీకు కలుగలేదా?’ అని అడుగుతాడు.
అప్పుడు రవితేజ దానికి సమాధానం చెప్తూ ‘నాలో ఇన్ సెక్యూరిటీ ఒక్క శాతం కూడా లేదు, అసలు అలాంటి ఫీలింగ్ తో ఉన్నవాళ్లను చూస్తే నాకు చాలా చిరాకు వేస్తాది..అన్నయ్య పక్కన నటించడం ఒక అదృష్టం గా మాత్రమే భావించాను కానీ, నా పాత్ర తగ్గుతుంది అని మాత్రం అసలు అనుకోలేదు’ అంటూ రవితేజ ఈ సందర్భంగా సమాధానం చెప్పాడు.