https://oktelugu.com/

Chhattisgarh Atrocity: అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌ రేప్‌ లో ఏఎస్ఐ కొడుకు.. స్వయంగా అరెస్ట్ చేసి ఆ పోలీస్ అధికారి ఏం చేశాడంటే?

అత్యాచార నిందితులు, అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు ఎస్‌ఎస్‌పీ బృందాలను నియమించారు. ఈ బృందాలు పలుచోట్ల గాలించి మరుసటి రోజు ఉదయం వారందరినీ అరెస్టు చేశాయి. ఏఎస్సై సాహుకు విచారణ అప్పగించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 5, 2023 / 12:50 PM IST

    Chhattisgarh Atrocity

    Follow us on

    Chhattisgarh Atrocity: ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాఖీ వేడుకలకు వెళ్లిన అక్క, చెల్లిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. రాయ్‌పూర్‌ జిల్లాకు చెందిన ఓ యువతి(19), ఆమెకు కాబోయే భర్త, చెల్లి(16)తో కలిసి బైక్‌పై వెళ్తుండగా కొందరు అడ్డుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు.

    రాఖీ వేడుకలకు వెళ్లి వస్తుండగా..
    రాయ్‌ పూర్‌ జిల్లాకు చెందిన ఓ యువతి(19)కి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఆమె తన చెల్లి(16), కాబోయే భర్తతో కలిసి రాఖీ వేడుకల కోసం గురువారం మహాసముంద్‌ జిల్లాకు బైక్‌పై బయల్దేరారు. వేడుకల అనంతరం ముగ్గురూ రాత్రి తిరిగి వస్తుండగా, రాయ్‌ పూర్‌ దగ్గర కొంతమంది అడ్డుకున్నారు. మొదట ముగ్గురు వచ్చి వాళ్ల దగ్గరున్న డబ్బులు, ఫోన్లు దోచుకుని వెళ్లిపోయారు. అదే టైమ్‌లో మరో ఏడుగురు అక్కడికి వచ్చారు. యువతికి కాబోయే భర్తను తీవ్రంగా కొట్టారు. అక్కాచెల్లెళ్లను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్‌ రేప్‌ చేసి వెళ్లిపోయారు.

    పోలీసులకు ఫిర్యాదు..
    తర్వాత కాసేపటికి తేరుకున్న బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని కంప్లయింట్‌ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, పది మందిని అరెస్టు చేశారు.

    నిందితుల కోసం ఎస్‌ఎస్‌పీ నేతృత్వంతో బృందాలు..
    అత్యాచార నిందితులు, అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు ఎస్‌ఎస్‌పీ బృందాలను నియమించారు. ఈ బృందాలు పలుచోట్ల గాలించి మరుసటి రోజు ఉదయం వారందరినీ అరెస్టు చేశాయి. ఏఎస్సై సాహుకు విచారణ అప్పగించారు. అయితే గ్యాంగ్ రేప్ చేసిన వారిలో తన కుమారుడు ఉండడంతో ఏఎస్ఐ సాహూ షాక్‌ అయ్యాడు, కుమారుడిని రాగద్వేషాలకు తావివ్వకుండా అరెస్టు చేసిన ఏఎస్ఐ సాహూ వెంటనే విచారణ నుండి తప్పుకొని శభాష్ అనిపించుకున్నాడు.

    -ప్రముఖుల పిల్లలు..
    నిందితుల్లో లోకల్‌ బీజేపీ లీడర్‌ లక్ష్మీనారాయణ సింగ్‌ కొడుకు పూనమ్‌ ఠాకూర్‌ ఉన్నారని పోలీసులు చెప్పారు. అతడు ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చాడని పేర్కొన్నారు. మరొకరు కేసును విచారిస్తున్న పోలీసు స్టేషన్‌లో నియమించబడిన పోలీసు అధికారి కుమారుడు కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. రేప్ కేసు నిందితుడి తండ్రి, ఏఎస్‌ఐ దీపక్‌ సాహు ఎలాంటి ఫైరవీలకు తావివ్వకుండా తన కొడుకు కృష్ణను అరెస్టు చేయడంపై ఎస్పీ అభినందించాడు. మరోవైపు ఏఎస్‌ఐ కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాయ్‌పూర్‌ సీనియర్‌ ఎస్పీ ప్రశాంత్‌ అగర్వాల్‌ కు విజ్ఞప్తి చేయగా.. ఆయన మన్నించి, విచారణకు ఆటంకం కలగకుండా ఏఎస్‌ఐ సాహును మరో పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. సామూహిక అత్యాచారానికి గురైన వారిలో ఒకరు మైనర్‌ ఉన్నారు.