Romantic Stars: నవరసాల్లో శృంగార రసం ఒకటి. వెండితెరపై విజయవంతమైన ఫార్ములా. శృంగార తారలను చిన్న చూపు చూసినా వారికుండే క్రేజ్ వేరు. కనిపించేది కొన్ని నిమిషాలైనా కూరలో ఉప్పులాంటోళ్లు. సీరియస్ గా సాగే కథలో శృంగార నాయకి ఎంట్రీ గొప్ప ఉపశమనం. బరువెక్కిన ప్రేక్షకుల హృదయాలను తేలికపరుస్తుంది. టాలీవుడ్ లో తరాలుగా కొందరు శృంగార తారలుగా వెలుగొందారు. గతంలో శృంగార తారలను ఇప్పుడు ఐటెం హీరోయిన్స్ అంటున్నారు. వెండితెరపై కలర్ఫుల్ గా కనిపించే వీరి నిజ జీవితం అంత బ్లాక్ అండ్ వైట్. కొందరి జీవితాలు ముగిసిన తీరు దారుణం. జ్యోతిలక్ష్మి నుండి ముమైత్ ఖాన్ వరకు పాప్యులర్ శృంగార తారలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
జ్యోతిలక్ష్మి
జ్యోతిలక్ష్మి తొలితరం శృంగారతార. అంతకు ముందు ప్రత్యేక గీతాలు చేసిన హీరోయిన్స్ ఉన్నా అంతగా పాప్యులర్ కాలేదు. తెలుగు సినిమా కమర్షియల్ టర్న్ తీసుకుంటున్న కొత్తల్లో ఆమె పరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రొఫెషనల్ డాన్సర్ అయిన జ్యోతిలక్ష్మి సిల్వర్ స్క్రీన్ పై శృంగార తారగా వెలుగొందింది. స్టార్ హీరోలు తమ చిత్రాల్లో జ్యోతిలక్ష్మి సాంగ్ కచ్చితంగా ఉండాలని పట్టుబట్టిన రోజులు ఉన్నాయి. అప్పట్లో జ్యోతిలక్ష్మి చేసిన ఎక్స్పోజింగ్ ట్రెండ్ సెట్టింగ్ అయ్యింది. చివరిగా 2009లో బంగారు బాబు మూవీలో కనిపించింది. 67 ఏళ్ల వయసులో 2016లో చెన్నైలో బ్లడ్ క్యాన్సర్ తో కన్నుమూసింది. ఆమె కూతురు జ్యోతి మీనన్ సినిమాల్లో రాణిస్తుంది.
జయమాలిని
టెన్నిస్ లో సెరీనా విలియమ్స్-వీనస్ విలియమ్స్ ఎలానో సిల్వర్ స్క్రీన్ పై జ్యోతిలక్ష్మి-జయమాలిని అలా. సొంత సిస్టర్స్ అయిన జ్యోతిలక్ష్మి-జయమాలిని ఒకరితోమరొకరు పోటీపడ్డారు. ఇక ఇద్దరు కలిసి చేసిన సాంగ్స్ కూడా ఉన్నాయి. జయమాలిని ఎంట్రీతో జ్యోతిలక్ష్మికి డిమాండ్ తగ్గింది. అయితే ఇద్దరూ సత్తా చాటారు. 1994లో పోలీస్ ఆఫీసర్ పార్తీబన్ ని వివాహం చేసుకుంది. నటనకు గుడ్ బై చెప్పింది. జయమాలినికి ఒకరు సంతానం.
సిల్క్ స్మిత
ఏలూరు దగ్గర ఓ కుగ్రామంలో పుట్టిన విజయలక్ష్మి అలియాస్ సిల్క్ స్మిత దాదాపు రెండు దశాబ్దాలు చిత్ర పరిశ్రమను ఏలింది. మోడరన్ జనరేషన్ కి తెలిసిన సెక్సీ బాంబు. పెద్దగా చదువుకోని సిల్క్ స్మితకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. పసిప్రాయంలోనే అత్తారింటి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుండి చెన్నై పారిపోయింది. ఎవరి సహకారం లేకుండా శృంగార తారగా ఎదిగింది. సౌత్ టు నార్త్ వందల చిత్రాల్లో నటించింది. విధిని ఎదిరించి ఎదిగిన సిల్క్ స్మితను మనుషుల మోసాలు, ప్రేమ పేరుతో చేసిన ద్రోహాలు కుంగదీస్తాయి. ఒంటరితనం భరించలేక 1996లో ఆత్మహత్య చేసుకుంది. ఒక అనాథ శవంలా ఆమె అంత్యక్రియలు జరగడం అత్యంత విషాదకరం.
డిస్కో శాంతి
1980వ దశకపు ప్రముఖ తెలుగు శృంగార నృత్యతార డిస్కో శాంతి. డిస్కో శాంతి విజయపురి వీరన్ మరియు కట్టుమల్లిక వంటి అనేక చిత్రాలలో నటించిన తమిళ నటుడు సిఎల్ ఆనందన్ కుమార్తె . సినిమాల్లోకి హీరోయిన్ అవ్వాలనే కలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన డిస్కో శాంతి తొలి రెండు సినిమాల్లో హీరోయిన్ గానే నటించింది. కానీ ఆ రెండు సినిమాలు ఆర్ధిక సమస్యల వల్ల విడుదల అవ్వలేదు. అప్పటికే తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఎదురుకుంటున్న తన కుటుంబం ని పోషించడం కోసం ఐటమ్ సాంగ్స్ చేస్తూ వచ్చింది. అలా వచ్చిన డబ్బులతోనే తన తోబుట్టువుల పెళ్లిళ్లను కూడా చేసింది. అయితే అప్పటికే సినిమాల్లో విలన్ గా రాణిస్తున్న శ్రీహరికి డిస్కోశాంతి నిచ్చింది. ఆమెను పెళ్లి చేసుకుందాం అని అడిగినప్పుడు నాకు ఇంట్లో చాలా బాధ్యతలు ఉన్నాయి, పెళ్లి చేసుకోలేను అని చెప్పిందట డిస్కోశాంతి.అయితే పట్టువిడవకుండా శ్రీహరి ‘పెళ్లి అయ్యాక మొత్తం నేను చూసుకుంటాను, నువ్వు సినిమాలు చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి గుడికి తీసుకెళ్లి తాళి కట్టాడట. ఈమె తెలుగు సినీరంగంలో రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న శ్రీహరిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నది. ఈమె చెల్లెలు లలిత కుమారి తమిళ సినిమారంగంలో కథానాయకి, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మొదటి భార్య.
షకీలా
శృంగార ప్రపంచాన్ని ఏలిన మరో తార షకీలా. మలయాళ చిత్ర పరిశ్రమపై ఆమె చెరగని ముద్ర వేశారు. షకీలా అడల్ట్ కంటెంట్ చిత్రాలు 90లలో శాసించాయి. మోహన్ లాల్, మమ్ముట్టి కూడా షకీలా మూవీ వస్తుందంటే వెనక్కి తగ్గాల్సిందే. అంతటి స్టార్డం అనుభవించినా షకీలా ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. ఆమె ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్ గా ఉన్నారు.
మొమైత్ ఖాన్
తెలుగులో యాభై చిత్రాల వరకూ చేసిన ముమైత్ ఖాన్ పలు భాషల్లో కలిపి వంద చిత్రాలకు పైగా చేసింది. అయినా ఆమె ఆర్థికంగా స్థిరపడలేదు. డబ్బుల కోసం తిరునాళ్లలో ఈవెంట్స్ చేసుకునే పరిస్థితికి చేరింది. పోకిరి, యోగి వంటి హిట్ చిత్రాల్లో ఐటెం నెంబర్స్ చేసిన ముమైత్ ఖాన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్. పలుమార్లు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంది.
అభినయశ్రీ
ఈ జనరేషన్ ఐటెం భామల్లో అభినయశ్రీ ఒకరు. శృంగార తారగా పలు ఐటెం సాంగ్స్ చేసిన అభినయశ్రీ హీరోయిన్ గా, కమెడియన్ రోల్స్ కూడా చేసింది. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్న అభినయశ్రీ బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్. అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. లైఫ్ లో స్ట్రగుల్స్ చూశానని ఆమె చెప్పుకొచ్చారు.
హంసా నందిని
కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా చేసిన హంసా నందిని మిర్చీ మూవీతో ఐటెం భామగా మారింది. భాయ్, రామయ్యా వస్తావయ్యా, లెజెండ్, అత్తారింటికి దారేది చిత్రాల్లో ఆమె ఐటెం సాంగ్స్ చేశారు. క్యాన్సర్ బారిన పడిన హంసా నందిని ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్నారు. ఆమె ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు …