spot_img
Homeఎంటర్టైన్మెంట్Heroine Anjali: ఆ స్టార్ హీరో వాడుకొని వదిలేశాడు.. హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్

Heroine Anjali: ఆ స్టార్ హీరో వాడుకొని వదిలేశాడు.. హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్

Heroine Anjali: హీరోయిన్ అంజలి ఒక హీరోని నమ్మి మోసపోయాను చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె నేరుగా ఆరోపణలు చేయడం సంచలనమైంది. తెలుగు అమ్మాయి అంజలి వరుసగా డిజిటల్ సిరీస్లు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఝాన్సీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఝాన్సీ సిరీస్ ప్రశంసలు దక్కించుకుంది. వెంటనే అంజలి మరో థ్రిల్లింగ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించారు.

Heroine Anjali
Heroine Anjali

అంజలి లీడ్ రోల్ చేసిన ‘ఫాల్’ అనే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. డిసెంబర్ 9 నుండి ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. సిద్ధార్థ్ రామస్వామి ఫాల్ సిరీస్ దర్శకుడిగా ఉన్నారు. ఫాల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న అంజలి పలు విషయాలపై స్పందించారు.ప్రచారం అవుతున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఆమె పెళ్లి వార్తలను ఖండించారు. అమెరికాలో ఉంటున్న ఇండియన్ ని అంజలి వివాహం చేసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.

ప్రతిసారి నా పెళ్లి విషయంలో నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నారు. నాకు ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన లేదు. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అందరికీ చెబుతాను. దయచేసి ఇలాంటి పుకార్లు ప్రచారం చేయకండని అంజలి అన్నారు. అయితే ఒక హీరో తనను నమ్మించి మోసం చేశాడని అంజలి చెప్పడంతో మీడియా ప్రతినిధులు షాక్ అయ్యారు. గతంలో నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. అతన్ని పూర్తిగా నమ్మాను. తను మాత్రం నన్ను మోసం చేశాడు.

Heroine Anjali
Heroine Anjali

అదొక విషపూరిత బంధం. నేను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరనేది నేను చెప్పను. ఎందుకంటే మాది ముగిసిన బంధం, వివరాలు అనవసరం. ఆనాటి సంగతులు గుర్తు చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు, అని అంజలి తెలియజేశారు. జర్నీ మూవీలో తనతో జతకట్టిన హీరో జై తో అంజలి సీరియస్ రిలేషన్ నడిపారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. అంజలికి తెలియకుండా మరో నటికి జై దగ్గరయ్యాడని, తెలియడంతో దూరం పెట్టిందట. అంజలి చెప్పిన ఆ మోసగాడు జై కావచ్చు అని కొందరి అంచనా. జై తో రిలేషన్ పై కూడా అంజలి స్పందించారు. నాకు పరిశ్రమలో చాలా మంది మిత్రులు ఉన్నారు. వారిలో జై కూడా ఒకరు. అంతకు మించి మా మధ్య ఏమీ లేదని ఆమె చెప్పుకొచ్చారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper