Homeఎంటర్టైన్మెంట్Thaman- Veera Simha Reddy: అవును వీరసింహారెడ్డి సాంగ్ కాపీనే... ఒప్పుకున్న థమన్ 

Thaman- Veera Simha Reddy: అవును వీరసింహారెడ్డి సాంగ్ కాపీనే… ఒప్పుకున్న థమన్ 

Thaman- Veera Simha Reddy: మ్యూజిక్ డైరెక్టర్స్ తరచుగా కాపీ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు. హాలీవుడ్డో, బాలీవుడ్డో నుండి ట్యూన్స్ లేపేస్తారనే వాదన ఉంది. అది నిజం కూడా. టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా చలామణి అయిన ప్రతి ఒక్కరూ ఈ కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందరితో పోల్చితే థమన్, దేవిశ్రీ ఎక్కువసార్లు బుక్ అయ్యారు. ప్రస్తుతం వారిద్దరే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కావడం విశేషం. కాగా వీరసింహారెడ్డి చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టరన్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య’ తీవ్ర ఆరోపణలకు గురైంది. జై బాలయ్య సాంగ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒసేయ్ రాములమ్మా’ సాంగ్ ని పోలి ఉందని విమర్శలు చేశారు.

Thaman- Veera Simha Reddy
Thaman- Veera Simha Reddy

తాజాగా ఈ ఆరోపణలపై స్పందించిన థమన్… జై బాలయ్య సాంగ్ ఒసేయ్ రాములమ్మ సాంగ్ నుండి కాపీ చేసిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. ఈ విషయం డైరెక్టర్ గోపీచంద్ మలినేని, లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రికి కూడా తెలుసని బాలయ్య అన్నారు. వందేమాతరం శ్రీనివాస్ సర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి నేను పని చేశాను. ఆ పాట స్ఫూర్తితోనే జై బాలయ్య కంపోజ్ చేశానని ఒప్పుకున్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ… దేవిశ్రీ కంపోజ్ చేసిన ‘వచ్చాడయ్యో సామీ’ సాంగ్ కి కూడా ఆధారం ఆ పాటనే అని వెల్లడించారు. అది కల్ట్ ఇమేజ్ ఉన్న పాటని నిజం ఒప్పుకున్నారు. కాగా అల వైకుంఠపురంలో చిత్రానికి థమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. ఆ చిత్ర విజయంలో థమన్ సాంగ్స్ కీలకమయ్యాయి. యూట్యూబ్ ని షేక్ చేశాయి. ఆ దెబ్బతో థమన్ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ పొజిషన్ కి వచ్చాడు .

Thaman- Veera Simha Reddy
Thaman- Veera Simha Reddy

ప్రస్తుతం స్టార్ హీరోలందరూ థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటున్నారు. నెక్స్ట్ మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నేడు విడుదలైన వారసుడు చిత్రానికి కూడా థమన్ పని చేశారు. థమన్ చేతిలో ఉన్న మరో అతిపెద్ద ప్రాజెక్టు ఆర్సీ 15. థమన్ బిజీఎమ్ కి ప్రసిద్ధి. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను గొప్పగా ఎలివేట్ చేస్తుంది. అఖండ చిత్రానికి థమన్ అద్భుతమైన బీజీఎం ఇచ్చారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper