RAJAMOULI VILLAINS
Rajamouli Villains : రాజమౌళి సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. నటుల నుంచి నటనను పిండడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా అంటారు. రాజమౌళి సినిమాలో బాగా నటించేవాళ్లే ఉంటారు. స్టేజ్ ఆర్టిస్టులను, టీవీ ఆర్టిస్టులను కూడా రాజమౌళి బాగా నటింపచేస్తారు. క్యారెక్టర్స్ కు పర్ ఫెక్ట్ సూట్ అయ్యే నటులనే రాజమౌళి ఎంపిక చేసుకొని పాత్రకు ప్రాణం పోస్తారు. అందుకే ఆయన పాత్రలు ఇప్పటికీ జనాల్లో గుర్తుండిపోతాయి.
రాజమౌళి సినిమాలో హీరో కంటే విలన్ భీకరంగా ఉంటాడు. విలన్ కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. హీరోలకు తగ్గ విలన్లను ఎంపిక చేయడంలో జక్కన్న దిట్ట. ఆయన పరిచయం విలన్స్ గురించి స్పెషల్ ఫోకస్..
-ప్రదీప్ రావత్
‘సై’ సినిమాలో భిక్షూ యాదవ్ గా భీకరంగా నటించిన బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.విలన్ అంటే ఇంత క్రూరంగా ఉంటాడా? అనేలా ఈ సినిమాలో కనిపించారు. అతడి లుక్ చూస్తేనే భయపెట్టేలా రాజమౌళి తీర్చిదిద్దాడు. సై తర్వాత ప్రదీప్ రావత్ కు విలన్ వేశాలు క్యూ కట్టాయి.
-దేవ్ గిల్
రాంచరణ్ హీరోగా మగధీర సినిమాలో విలన్ గా నటించిన దేవ్ గిల్ ఒక రాజవంశీయుడి పాత్రలో ఇరగదీశాడు. బాలవుడ్ కు చెందిన దేవ్ గిల్ మగధీరలో ‘రణదేవ్ బిల్లా’ పాత్రలో వీరావేశం చూపించాడు.
-సుదీప్
ఈగ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు కన్నడ హీరో సుదీప్. అతడిలోని నటనను అద్భుతంగా ఆవిష్కరించాడు. సుదీప్ మంచి నటుడే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, సింగర్, హోస్ట్ కూడా కావడం గమనార్హం.
-అజయ్
సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన అజయ్ తర్వాత హీరో ఫ్రెండ్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. స్థిరపడ్డాడు. ఒక ట్రెండ్ సినిమాల్లో హీరోగా నటించాడు. విక్రమార్కుడు మూవీలో టిట్లా పాత్రలో ఇరగదీశాడు. ఆ పాత్రకు ప్రాణం పోశాడు.
-నాగినీడు
మర్యాదరామన్న సినిమాలో రాజమౌళి పరిచయం చేసిన ఈ సీనియర్ నటుడు ఆ పాత్రకు జీవం పోశాడు.
–సుప్రీత్
ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ పాత్రలో ఎంత క్రూరత్వం చూపించాలో అంతా చూపించి విలన్ గా ఇరగదీశాడు. సై, మర్యాదరామన్నలోనూ నటించాడు.
-కాలకేయ ప్రభాకర్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ప్రభాకర్ ను బాహుబలిలో మెయిన్ విలన్ గా‘కాలకేయుడి’గా భీకరంగా చూపించి అతడి కెరీర్ కు బూస్ట్ తెచ్చాడు రాజమౌళి. కాలకేయ పాత్ర ప్రభాకర్ కు బాగా గుర్తింపు తీసుకొచ్చింది.
-రానా
బాహుబలిలో భళ్లాల దేవుడిగా రానా నట విశ్వరూపం చూపించాడంటే దానికి రాజమౌళినే కారణం. హీరోగా కొనసాగుతున్న రానాను ఈ సినిమాతో విలన్ ను చేసి ప్రభాస్ తో పోటీపడి నటింపచేశాడు జక్కన.
ఇలా భీకర విలన్లను టాలీవుడ్ కు పరిచయం చేసి వారికి, చిత్ర పరిశ్రమకు అసలైన విలనిజాన్ని రాజమౌళి రుచిచూపించాడు.