Eesha Rebba: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో. తెలుగు బ్యూటీ ఈషా రెబ్బకు చక్కని రూపంతో పాటు మంచి టాలెంట్ కూడా ఉంది. అయితే కాలం కలిసి రావడం లేదు. బ్రేక్ రాక రేసులో వెనుకబడిపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్ కి చెందిన ఈషా రెబ్బా హీరోయిన్ కావాలనే కోరికతో పరిశ్రమలో అడుగు పెట్టారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తన కలకు పునాది వేశాడు.
2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా రెబ్బా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది. అనూహ్యంగా ఈ మూవీలో నటించిన వారెవరూ కెరీర్లో ఎదగలేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో అభిజీత్ హీరోగా నటించారు. ఆయన దాదాపు పరిశ్రమకు దూరమయ్యారు.
అయితే ఈషా కెరీర్లో కొన్ని హిట్స్ ఉన్నాయి. అంతకు ముందు ఆ తర్వాత, అమీ తుమీ, ‘అ’ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఆమెకంటూ ఇమేజ్, ఫేమ్ తేలేకపోయాయి. అనూహ్యంగా ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. అరవింద సమేత మూవీలో ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్ అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ అన్యాయం చేశారు. సినిమా విడుదలయ్యాక చూస్తే… ఆమెది కేవలం ఓ ఎక్స్ట్రా రోల్ అని తేలింది.
తెలుగులో ఈషా రెబ్బాకు ఆడపాదడపా ఆఫర్స్ కూడా ఆగిపోయాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో చిన్న క్యామియో రోల్ చేసిన ఈషా రెబ్బా మళ్ళీ కనిపించలేదు. ఆమె తెలుగు చిత్రానికి సైన్ చేసిన దాఖలాలు లేవు. సాధారణంగానే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల పట్ల వివక్ష ఉంటుంది. కన్నడ, మలయాళ భామలకు ఇచ్చిన ప్రాధాన్యత లోకల్ టాలెంట్ కి ఇవ్వరు. దీంతో ఈషా లాంటి అమ్మాయిలు నిరాధారణకు గురవుతున్నారు.
సినిమా ఆఫర్స్ రాకున్నా సోషల్ మీడియాలో ఈషా సందడి చేస్తుంది. తాజాగా ఆమె చోళీ, లెహంగా ధరించి సూపర్ హాట్ పోజులిచ్చారు. బెంగుళూరు టైమ్స్ ఫ్యాషన్ వీక్లో పాల్గొన్న ఈషా రెబ్బా పరువాలు ప్రదర్శించారు. ఈషా రెబ్బా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె జీరో సైజ్ బాడీ చూసి కుర్రాళ్ళు టెంప్ట్ అవుతున్నారు.