Youtuber Sri Wedding: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం పెరుగుతోంది. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో వాటికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఉపాధికి ఊతమిస్తున్నాయి. లక్షలాది మంది సోషల్ మీడియాను నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. వినోదంతో పాటు డబ్బులు కూడా సొంతమవుతున్నాయి. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి వాటి ద్వారా రూ. లక్షలు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ల్లో షార్ట్ ఫిల్మ్ లు, వీడియోలు పోస్టులు పెడుతూ సంపాదన రెట్టింపు చేసుకుంటున్నారు.

చాలా మందికి ఇదే ఉపాధిగా మారుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది లబ్ధిపొందుతున్నారు.
ఒక్కొక్కరు లక్షలాది మందిని తమ అనుచరులుగా మార్చుకుంటున్నారు. ఒక్కో వీడియోకు ఎన్నో లైకులు, మరెన్నో షేర్లు వస్తుండటంతో అదే తమ విధిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ చానల్ నిర్వాహకుడు వివాహం చేసుకున్నాడు. పెళ్లిని మొత్తం యూట్యూబ్ ల పెట్టాడు. తన అనుచరులు ఆశీర్వదించాలని కోరాడు. అందరు నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ కట్నాలు కూడా పంపించారు. ఆ కట్నాలు ఎంత వచ్చాయో తెలిస్తే షాకే. వేలల్లోనే కాదు లక్షల్లో కాదు ఏకంగా రూ.4 కోట్లు రావడం గమనార్హం.

ఈ విషయాన్ని సదరు నిర్వాహకుడు తెలియజేయడంతో అందరు అవాక్కయ్యారు. సుమారు 23 వేల పైచిలుకు నుంచి 4 కోట్ల వరకు కట్నాలు రావడం అంటే మాటలు కాదు. ఈ విషయం నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇంత భారీ మొత్తంలో డబ్బులు రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో తెలుస్తోంది. ఎన్నో కోట్ల మందికి యూట్యూబ్ ఆదాయ వనరుగా మారింది. ఒక్కొక్కరు రూ. లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. సులభంగా ఇంటి వద్ద ఉంటే డబ్బులు ఆర్జిస్తున్నారు.
తాజాగా ఓ తెలుగు యూట్యూబర్ పెళ్లికి సబ్ సబ్ స్క్రైబర్స్ నాలుగు కోట్లు పంపడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. యూ ట్యూబ్ లో యాక్టివ్ గా ఉండే వారికి థింక్స్ యూట్యూబ్ చానల్ గురించి అందరికి తెలుసు. దాని నిర్వాహకుడు శ్రీ వివాహం ఇటీవల జరిగింది. దాన్ని అతడు తన యూ ట్యూబ్ చానల్ లో పెట్టాడు. దీంతో అతడి ఫాలోవర్స్ మొత్తం పంపిన డబ్బులు ఏకంగా నాలుగు కోట్లు రావడంతో అందరు నోరెళ్లబెట్టారు. యూట్యూబ్ ద్వారా వచ్చిన కట్నాలే అంత రావడం సంచలనం కలిగిస్తోంది.