Namrata Shirodkar: మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ వైవాహిక బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ తో ఆమెకు ఏ విషయాల్లో గొడవలు జరుగుతాయి. సినిమా ఎందుకు మానేశారనే విషయాలపై ఆమె స్పష్టత ఇచ్చారు. మహేష్ ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నేను ఎంతో సంతోషానికి గురయ్యాను. నేను మోడలింగ్ పై ఇష్టంతో ఆ రంగంలో కెరీర్ స్టార్ట్ చేశాను. కొన్నాళ్లకు మోడలింగ్ పై విసుగొచ్చేసింది. అందుకే హీరోయిన్ గా మారాను. నటిగా వృత్తిని చాలా ఆస్వాదించాను.

హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న క్రమంలో మహేష్ పరిచయం అయ్యాడు. ఒకరినొకరం ఇష్టపడ్డాము. మహేష్ ని నేను వివాహం చేసుకున్నాను. మహేష్ కి భార్య ఎలా ఉండాలో ఒక స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే నేను పెళ్ళి తర్వాత సినిమాలు మానేశాను. పెళ్ళైనా ఆఫర్స్ వచ్చాయి. నటించడం నాకు అసలు ఇష్టం లేదు. తల్లి అయ్యాక నా ప్రపంచమే మారిపోయింది. మాతృత్వాన్ని నేను ఎంతగానో ఆస్వాదించాను. మహేష్ తో నాకు ఎలాంటి గొడవలు ఉండవు.
ఒక విషయంలో మాత్రం ఇద్దరం తరచూ గొడవలు పడతాం. పిల్లలు ఏది కావాలన్నా మహేష్ ని అడుగుతారు. ఆయన కాదనకుండా కొనిపెడతారు. అది నాకు నచ్చదు. వద్దని మహేష్ ని వారిస్తాను. ఆ విషయంలో మాత్రమే మహేష్ కి నాకు గొడవలు జరుగుతాయి. అయితే అవన్నీ సరదా గొడవలే, అని నమ్రత ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు. వంశీ మూవీలో మహేష్ కి జంటగా నమ్రత నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమ చిగురించింది. దాదాపు ఐదేళ్లు మహేష్-నమ్రత రహస్యంగా ప్రేమించుకున్నారు.

2005లో మహేష్-నమ్రత వివాహం అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా జరిగింది. మహేష్ పెళ్లి వార్త అప్పట్లో పెద్ద న్యూస్. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న మహేష్ పెళ్లి విషయం తెలిసి లేడీ ఫ్యాన్స్ గుండె బద్దలు అయ్యాయి . మహేష్ పై ప్రేమతో సినిమా వదిలేసి నమ్రత గృహిణిగా మారిపోయారు. గౌతమ్, సితారకు జన్మనిచ్చిన నమ్రత వారి ఆలనా పాలనా దగ్గరుండి చూసుకున్నారు. ఇద్దరూ కొంచెం పెద్దయ్యాక మహేష్ కెరీర్ బాధ్యతలు, వ్యాపారాలు నమ్రత చూసుకుంటున్నారు. ఆయనకు పర్సనల్ మేనేజర్ గా మారిపోయారు.