
National Panchayat Awards 2023: గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు. ఆ గ్రామాలే ఉంటే దేశం లేదు. దేశంలో సాంస్కృతి లేదు.. అభివృద్ధి కూడా లేదు. నేటికీ దేశ జనాభాలో 70% గ్రామాల్లోనే నివసిస్తోంది. అంతేకాదు దేశ జిడిపికి ఇతోధికమైన చోధక శక్తిని అందిస్తోంది. కానీ అలాంటి గ్రామాలను జగన్ ప్రభుత్వం విస్మరించింది. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడుని అభినందించవచ్చు.
గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను పాదుకొల్పి గ్రామ స్వరాజ్యానికి కొత్త అర్థం చెబుతున్నామని జగన్ సర్కారు ముక్తాయింపు ఇచ్చుకోవచ్చు. గ్రామాల్లో సచివాలయాలు నిర్మిస్తున్నామని దెబ్బలు చరుచుకోవచ్చు. ప్రతి నెలా పింఛన్లు నేరుగా లబ్ధిదారుల చెంతకే వెళ్లి ఇస్తున్నామని గొప్పలు పోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇవి నిలబడలేదు. పప్పు బెల్లాల పంపిణీ అనేది అభివృద్ధిని నిర్దేశించలేదు. ఇలా పంచుకుంటూ పోతే ఏం మిగులుతుంది? అసలు గ్రామాభివృద్ధి అంటే ఇది కాదు కదా!
మెరుగైన పారిశుధ్యం, తాగేందుకు నీరు, గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణం, వీధుల్లో చెత్త లేకుండా ఉండటం, పందుల బెడద, కోతుల కిష్కింధ కాండ లేకుండా ఉంటేనే పల్లె జీవితం సజావుగా సాగుతుంది.. కానీ వీటిని ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం విస్మరించినట్టు ఉంది.. ఫలితంగా గ్రామాల్లో డంపింగ్ యార్డ్ లు లేవు. స్వచ్ఛమైన నీరు అందడం లేదు.. డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్డు మీదనే పారుతోంది. ఇక మొదట్లో ఇచ్చిన పింఛన్లు ఇప్పుడు చాలామందికి అందడం లేదు. అలాంటప్పుడు గ్రామ స్వరాజ్యాన్ని మేము పాదుకు కొల్పుపుతున్నామని పాలకులు ఎలా చెప్పుకుంటారు?

ఇక గ్రామపంచాయతీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 27 విభాగాల్లో వివిధ రకాలైన అవార్డులు ఇస్తున్నది. ఈ పంచాయతీ అవార్డులో తెలుగుదేశం హయాంలోనే ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ దక్కేవి. ఈసారి ఒక్కడుంటే ఒక అవార్డు కూడా రాలేదు. జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ అత్యధిక అవార్డులను గెలుచుకుంది. మొత్తం 27 అవార్డుల్లో 8 పురస్కారాలు అందుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అవార్డు కూడా దక్కలేదు. ఒరిస్సా మూడు, ఛత్తీస్ గడ్ రెండు పురస్కారాలు దక్కించుకున్నాయి. ఆరోగ్య పంచాయతీ, సమృద్ధిగా నీరు కలిగిన పంచాయతీ, సామాజిక భద్రత, మహిళా భద్రత, పేదరికం లేని మెరుగైన జీవనోపాధి, పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్, పచ్చదనం, పరిశుభ్రత, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగాల్లో తెలంగాణ పల్లెలు అవార్డుల పంట పండించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసిన చెప్పుకోదగిన పనులు జరగకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.