https://oktelugu.com/

Facebook And Instagram: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో సాంకేతిక లోపం.. పేలుతున్న మీమ్స్

ఫేస్ బుక్ సేవలలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి.. " సమస్యను గుర్తించాం.. పరిష్కరించాం. ఇక సేవలను మీరు పొందొచ్చు" అని Mark Zuckerberg parody అనే ట్విట్టర్ ఐడి నుంచి ఓ ట్వీట్ తెగ చక్కర్లు కొడుతోంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 6, 2024 8:48 am
    Facebook And Instagram

    Facebook And Instagram

    Follow us on

    Facebook And Instagram: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఖాతాలు తెరుచుకోలేదు. దీంతో భయపడిన నెటిజన్లు తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయని ఆందోళన చెందారు. ఒకటికి పది సార్లు చెక్ చేసుకున్నారు.. చివరికి అమెరికాలోని ఫేస్ బుక్ ప్రధాన సర్వర్ లోనే సాంకేతిక సమస్య ఏర్పడినట్లు వార్తలు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంత జరిగినప్పటికీ ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కనీసం ఒక మెసేజ్ కూడా ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేయలేదు. కొంత సమయానికి సేవలు పున:ప్రారమయ్యాయి. దీంతో నెటిజన్లున్ ఊపిరి పీల్చుకున్నారు.

    ఫేస్ బుక్ సేవలలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి.. ” సమస్యను గుర్తించాం.. పరిష్కరించాం. ఇక సేవలను మీరు పొందొచ్చు” అని Mark Zuckerberg parody అనే ట్విట్టర్ ఐడి నుంచి ఓ ట్వీట్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ మీమ్ ఇప్పటికే మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.. ఇది ఐడి నుంచి కొన్ని లక్షల తీగల (కేబుల్స్ వరసలు) మధ్యలో జూకర్ బర్గ్ చొరబడి వాటిని సరిచేస్తున్నట్టు మరో మీమ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. మరీ ముఖ్యంగా మెటా ఆధ్వర్యంలో నడిచే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ రూపంలో ఉన్న ఓ మహిళ ఆసుపత్రిలో ఉండగా.. ట్విట్టర్ రూపంలో ఉన్న ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు.. అతడు చలాకీగా ఉంది.. నాలాగా నువ్వు చేయని ఆ మహిళను అడుగుతున్నట్టు రూపొందించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో కూడా దాదాపు మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది.

    ఫేస్ బుక్ వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. దాని సేవల్లో స్వల్ప అంతరాయం ఏర్పడితేనే ఇబ్బంది పడుతున్నారని.. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమోనని మరి కొందరు హాలీవుడ్ సినిమాల్లో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. మొత్తానికి ఫేస్ బుక్ సేవల్లో స్వల్ప అంతరాయానికి ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది.. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు జనం సోషల్ మీడియాకు ఏ స్థాయిలో బానిసలైపోయారో చెప్పడానికి..