Shehzada Teaser: అల వైకుంఠపురంలో మూవీ హిందీలో రీమేక్ అవుతుండగా టీజర్ నేడు విడుదలైంది. అయితే అల్లు అర్జున్ కి కార్తీక్ ఆర్యన్ ఏమాత్రం సరికాదంటున్నారు అభిమానులు. అదే సమయంలో షెహజాదా టీజర్ ఏమంత ఆకట్టుకోలేదంటున్నారు. 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది అల వైకుంఠపురంలో. అల్లు అర్జున్ కెరీర్లో హైలెట్ గ్రాసర్ గా నిలిచిన అల వైకుంఠపురంలో అనేక రికార్డ్స్ బద్దలు కొట్టింది. దర్శకుడు త్రివిక్రమ్ కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. ఇక థమన్ సాంగ్స్ పెద్ద సెన్సేషన్ సృష్టించాయి.

అల వైకుంఠపురంలో సక్సెస్ లో థమన్ సాంగ్స్ కీలక పాత్ర వహించాయి. యువతను ఊపేసిన ఈ సాంగ్స్ థియేటర్స్ ముందు క్యూ కట్టేలా చేశాయి. ఇక అల్లు అర్జున్ ని త్రివిక్రమ్ ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది. మాస్ మేనరిజమ్స్, క్లాస్ యాటిట్యూడ్ మెస్మరైజ్ చేశాయి. అల్లు అర్జున్ కెరీర్లో అల వైకుంఠపురంలో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. దీంతో ఈ మూవీ ఆయనకు చాలా ప్రత్యేకంగా నిలిచింది.
అల వైకుంఠపురంలో స్టోరీ నచ్చిన బాలీవుడ్ మేకర్స్ రైట్స్ కోసం ఎగబడ్డారు. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అల వైకుంఠపురంలో హిందీ రిమేక్ రైట్స్ దక్కించుకున్నారు. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో అల వైకుంఠపురంలో చిత్రాన్ని షెహజాదా టైటిల్ తో నిర్మిస్తున్నారు. నేడు కార్తీక్ ఆర్యన్ బర్త్ డే నేపథ్యంలో షెహజాదా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. షెహజాదా టీజర్ అల వైకుంఠపురంలో చిత్రాన్ని ఏమాత్రం మరిపించలేకపోయింది. టీజర్లో కార్తీక్ ఆర్యన్ ప్రెజెన్స్ కూడా అంత గొప్పగా లేదంటున్నారు.

టీజర్ చూశాక అల వైకుంఠపురంలో చిత్రాన్ని బాలీవుడ్ మేకర్స్ కిచిడీ చేశారేమో అనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ స్టైల్, మేనరిజం ఎవరి వల్లా కాదని ఆయన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన షెహజాదా మూవీలో కృతి సనన్ హీరోయిన్ గా నటించారు. 2023 ఫిబ్రవరి 23న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం హిందీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
