https://oktelugu.com/

రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు.. ఈ వింత ఎక్కడ జరిగిందంటే..?

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. రాముడి విగ్రహం నుంచి కన్నీళ్లు వచ్చాయి. కారేపల్లి మండలం వెంకటయి తండాలోని రామాలయంలో ఉన్న రాముడి విగ్రహం నుంచి కన్నీళ్లు రావడం గమనార్హం. ఈ విషయం తెలిసిన ప్రజలు తండోపతండాలుగా ఆ గ్రామానికి వెళుతున్నారు. రాముడి కంటినుంచి కన్నీళ్లు రావడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలను ప్రస్తుతం కరోనా మహమ్మారి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో మున్ముందు మాన‌వజాతికి రాబోతున్న‌ మ‌రిన్ని క‌ష్టాల‌కు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 16, 2021 / 02:27 PM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. రాముడి విగ్రహం నుంచి కన్నీళ్లు వచ్చాయి. కారేపల్లి మండలం వెంకటయి తండాలోని రామాలయంలో ఉన్న రాముడి విగ్రహం నుంచి కన్నీళ్లు రావడం గమనార్హం. ఈ విషయం తెలిసిన ప్రజలు తండోపతండాలుగా ఆ గ్రామానికి వెళుతున్నారు. రాముడి కంటినుంచి కన్నీళ్లు రావడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలను ప్రస్తుతం కరోనా మహమ్మారి పీడిస్తున్న సంగతి తెలిసిందే.

    ఇలాంటి సమయంలో మున్ముందు మాన‌వజాతికి రాబోతున్న‌ మ‌రిన్ని క‌ష్టాల‌కు రాముడి కన్నీళ్లే సాక్ష్యమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన జరిగిన గ్రామంలో నివశించే తండా వాసులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ ఘటన వల్ల గ్రామానికి ఏదైనా అరిష్టం జరగవచ్చని గ్రామస్తులు భావిస్తుండటం గమనార్హం. మరి కొందరు రాముల వారికి ప్రత్యేక పూజలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

    రాముడి విగ్రహం నుంచి కన్నీళ్లు వస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. గతంలో కూడా ఈ తరహా ఘటనలు పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఖమ్మం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు తండాకు పెద్దఎత్తున వస్తున్నారు. ఈ ఘటన వల్ల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉండటం గమనార్హం. అయితే ఈ వింత ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు.

    శ్రీరాముని మహిమల వల్లే కంటి నుంచి కన్నీళ్లు వస్తున్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామమైన వెంకటాయితండా పేరు ఈ ఘటన వల్ల మారుమ్రోగుతుండటం గమనార్హం.