Homeక్రీడలుIndia VS Pakistan Asia Cup Promo: పాకిస్తాన్ తో ఫైట్.. రోహిత్ శర్మ ‘కసి’...

India VS Pakistan Asia Cup Promo: పాకిస్తాన్ తో ఫైట్.. రోహిత్ శర్మ ‘కసి’ వీడియో చూస్తే గూస్ బాంబ్సే

India VS Pakistan Asia Cup Promo: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. ప్రేక్షకుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంటుంది. దీంతో దాయాదుల పోటీలో ఎవరు నెగ్గుతారో అనే విషయంపై అభిమానుల్లో బెట్టింగులు వేసుకునేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ దేశాలు ఆసియా కప్ లో తలపడనున్న విషయం తెలిసిందే. ఇరవై రోజుల ముందే స్టార్ స్పోర్ట్స్ లో ఓ ఆసక్తికర ప్రోమో విడుదల చేసి అందరిలో ఉత్సాహం నింపుతోంది. ఈ మేరకు మన ప్రేక్షకులు ఉర్రూతలూగుతున్నారు.

India VS Pakistan Asia Cup Promo
rohit sharma, babar azam

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులో ఉండి కాలు దువ్వుతూ సమరానికి సై అన్నట్లుగా కాలు దువ్వుతున్నట్లు చూపిస్తున్నారు. పాకిస్తాన్ లోనూ మంచి కూడా మంచి ఆటగాళ్లున్నారని ప్రస్తావిస్తాడు. ఇండియా ఆసియా కప్ ఎనిమిదో సారి గెలవాలి. అభిమానుల కోరిక నెరవేరాలి అంటూ ప్రోమోలో రోహిత్ చెప్పడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మ్యాచ్ కంటే ముందే ఎన్నో ఆశలు అభిమానుల్లో పెరుగుతున్నాయి. దీంతో ఇండియా, పాక్ మ్యాచ్ పై ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే ఉత్సాహం పెరుగుతోంది.

Also Read: Gautam Adani: ఆసియా సంపన్నుడు అదానీ.. సెకనుకు రూ.1.4 కోట్ల సంపాదన

టీమిండియా మరోమారు కప్ గెలిచి తన సత్తా చాటుతుందని ప్రోమోలో చెబుతున్నారు. 140 కోట్ల మంది అభిమానుల ఆశలు నెరవేర్చే క్రమంలో మనవాళ్లు సమష్టిగా రాణిస్తామని చెబుతున్నాడు. ఇంతవరకు ఇండియా ఆసియా కప్ ఏడుసార్లు గెలుచుకుని ముందంజలో నిలిచింది. శ్రీలంక ఐదుసార్లు గెలుచుకుంది. పాకిస్తాన్ మాత్రం రెండుసార్లు మాత్రమే గెలుచుకుంది. దీంతో మన జట్టు ఇప్పుడు కూడా గెలిచి తీరుతుందని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ లో సత్తా చాటి అభిమానుల కోరిక తీరుస్తామని ప్రకటించడం గమనార్హం.

India VS Pakistan Asia Cup Promo
rohit sharma, babar azam

ఇదివరకే ఇంగ్లండ్, వెస్టిండీస్ లలో అందుకున్న విజయాలతో ఇప్పుడు కూడా ఆసియా కప్ లో అదే జోరు కొనసాగించి అభిమానుల్లో మరింత సంతోషం నింపేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే ప్రత్యర్థి జట్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కీలక ఆటగాళ్లను అడ్డుకుని విజయం సాధించి తీరుతామని చెబుతున్నారు. ఆసియా కప్ లో సమష్టిగా ఆడి కప్ గెలిచి అందరిలో ఉత్సాహం నింపుతామని భరోసా కల్పించనున్నారు. దీనిపై స్టార్ స్పోర్స్ట్స్ లో విడుదల చేసిన ప్రోమోతో అందరిలో జోష్ పెరుగుతోంది.

Also Read:Minister Roja Comments: చూసుకోండబ్బా.. జబర్ధస్త్ పై మంత్రి రోజా అనూహ్య కామెంట్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular