
Tarakaratna Last Photo: మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు దూరమైతే మనసుకి ఎంత బాధగా ఉంటుందో మాటల్లో చెప్పలేము.అలాంటి కుటుంబం లో అందరికీ దూరమై భర్తే లోకం, ఆయన ప్రేమ మరియు తోడు ఉంటే చాలు, ఇంకేమి అవసరం లేదు అనుకుంటున్నా అలేఖ్య రెడ్డి కి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.నందమూరి తారకరత్న ఎవరికీ తెలియకుండా అలేఖ్య రెడ్డి ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ విషయం తెలిసి ఇరువురి కుటుంబ సభ్యులు ఈ జంటని దూరం పెట్టేసారు.
దాంతో వీళ్లిద్దరు ఒంటరిగా హైదరాబాద్ కి వచ్చి ఎన్నో ఒడిదుడుగులను, ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొని నేడు స్థిరపడితే ఆ దేవుడు వీళ్ళిద్దరినీ దూరం చేసేసాడు.తారకరత్న ని తన వద్దకు పిలుచుకొని ఆయన భార్య పిల్లలను దిక్కులేని వాళ్ళని చేసాడు.ఇలాంటివి చూసినప్పుడే అసలు దేవుడు నిజంగా ఉన్నాడా అనే సందేహాలు మొదలు అవుతాయి.ఇది ఇలా ఉండగా అలేఖ్య రెడ్డి తారకరత్న చనిపోయిన రోజు నుండి నేటి వరకు ఆయనతో తనకి ఉన్న మధురమైన జ్ఞాపకాలను తల్చుకుంటూ సోషల్ మీడియా లో వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ ఉంది.
రీసెంట్ గా ఆమె తారకరత్న తో దిగిన చివరి ఫోటో ని ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.ఆమె మాట్లాడుతూ ‘ఈ మా కుటుంబం చివరి ఫోటో..ఇదే మా చివరి ట్రిప్ అనే విషయం నా హృదయాన్ని కలిచివేస్తుంది..ఇదంతా కల అయితే ఎంత బాగుణ్ణు..నువ్వు తిరిగి వచ్చి ‘అమ్మా..బంగారు’ అని మళ్ళీ పిలిస్తే వినాలని ఉంది’ అంటూ ఎంతో ఎమోషనల్ గా ఆమె పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.ప్రతీ రోజు ఆమె పడుతున్న భాదని చూసి అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

మంచి వాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు అంటూ వాపోతున్నారు.పిల్లల కోసమైనా మీరు ధైర్యం గా ఉండాలి వదినా అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో అలేఖ్య రెడ్డి కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.కానీ ఎంత ధైర్యం చెప్పినా బాధ ఆమెది..చెప్పినంత తేలిక కాదు,ఆమె సాధ్యమైనంత తొందరగా ఈ మనోవేదన నుండి కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుందాము.