
Dhanush Sir Movie: ధనుష్ హీరో గా నటించిన ‘సార్’ చిత్రం ఇటీవలే విడుదలై తెలుగు లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.తెలుగు లో ఆయనకీ ఇది మొట్టమొదటి సినిమా, అయినప్పటికీ ఆడియన్స్ ఆయన సినిమాని నెత్తిన పెట్టుకొని మరీ ఆదరించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఆరు కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం,కేవలం మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి వచ్చింది.
ఇప్పటికీ 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కి కలిపి 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.అంటే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి దాదాపుగా మూడింతలు లాభాల్ని తెచ్చిపెట్టింది అన్నమాట.తెలుగు లో ఈ రేంజ్ థియేట్రికల్ షేర్స్ ని దక్కించుకున్న ఈ సినిమా, తమిళం లో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి నానా తంటాలు పడుతుంది.
తమిళనాడు లో ఈ చిత్రాన్ని ‘వాతి’ అనే పేరు తో విడుదల చేసారు.ఓపెనింగ్స్ మరియు లాంగ్ రన్ అక్కడ కూడా బాగానే వచ్చింది కానీ, ధనుష్ రెగ్యులర్ సూపర్ హిట్ సినిమాకి వచ్చినంత వసూళ్లు మాత్రం రాలేదు.ఇప్పటి వరకు తెలుగు మరియు తమిళం వెర్షన్స్ కి కలిపి 44 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ప్రీ రిలీజ్ థియేట్రీకల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల రూపాయలకు జరిగింది.

ఆ 36 కోట్ల రూపాయలలో తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్..మిగిలింది మొత్తం తమిళనాడే.అక్కడ ఈ సినిమా ఇప్పటి వరకు 29 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.తమిళ వెర్షన్ బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ స్టేటస్ చేరుకోవడానికి ఇంకో కోటి రూపాయలకు దూరం గా ఉందని..మరో రెండు మూడు రోజుల్లో ఆ మార్కుని అందుకొని అక్కడ కూడా హిట్ గా నిలుస్తుందని చెప్తున్నారు.చూడాలిమరి.