
Actor Simbu Marriage: కోలీవుడ్ లో ఎప్పుడూ వివాదాల్లో ఉండే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది శింబు మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.కోలీవుడ్ ఈయనకి ఉన్నన్ని అఫైర్స్ ఏ హీరో కి కూడా ఉండేది కాదు.నయనతార తో ఆరోజుల్లో ఈయన నడిపిన ప్రేమాయణం పెద్ద సెన్సేషన్ అయ్యింది,వీళ్లిద్దరికీ సంబంధించిన ప్రైవేట్ రొమాంటిక్ ఫోటోలు అప్పట్లో కలకలం రేపాయి.పెళ్లి కూడా చేసుకుంటారు అనుకున్నారు , కానీ చివరికి ఏమైందో ఏమో తెలియదు కానీ విడిపోయారు.
ఇక ఆ తర్వాత త్రిష, హన్సిక వంటి హీరోయిన్స్ తో కూడా మనోడు లవ్ ట్రాక్ నడిపాడు.కానీ పెళ్లి వరకు ఏది వెళ్ళలేదు,రీసెంట్ గా కూడా నిధి అగర్వాల్ తో డేటింగ్ లో ఉన్నాడు అంటూ కోలీవుడ్ లో రూమర్స్.అది నిజమో కాదో తెలియదు కానీ,మనోడు మొత్తానికి పెళ్లి పీటలు మాత్రం ఎక్కబోతున్నాడని కోలీవుడ్ మొత్తం ఒక వార్త కోడై కూసింది.
శ్రీలంక కి చెందిన ఒక అభిమానిని శింబు పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి.సోషల్ మీడియా ద్వారా ఈ వార్త నేరుగా శింబు వరకు చేరింది.దీనితో వెంటనే తన టీం చేత ఒక ప్రెస్ నోట్ విడుదల చేయించాడు.సోషల్ మీడియా లో ఈరోజు వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం అని, దయచేసి ఏదైనా వార్త ప్రచురించే ముందు మమల్ని ఒకసారి సంప్రదించండి,ఇలా నోటికి ఏది వస్తే అది రాయొద్దు అంటూ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

దీనితో ఉదయం నుండి జోరుగా ప్రచారమైన ఈ వార్త కి అడ్డుకట్ట పడింది.అంటే శింబు కి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదు అన్నమాట.ఈ వార్త విని ఆయన అభిమానులు ఎంతో సంతోషించారు.ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటున్నాడు, లేకపోతే రాబొయ్యే రోజుల్లో ఇంకెంత మంది హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నాయి అనే వార్తలు వినాల్సి వచ్చేదో అని అనుకున్నారు.కానీ పెళ్లి అనేది ఫేక్ న్యూస్ అవ్వడం తో ఒక్కసారిగా కంగుతిన్నారు శింబు ఫ్యాన్స్.