Tamil Nadu : పరిమిత వనరుల ద్వారానే హైడ్రో పవర్, థర్మల్ పవర్ ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. విండ్ పవర్ కూడా వాతావరణంలో గాలి అధికంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఏటవాలుగా గాలి వేచినప్పుడే విండ్ పవర్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సోలార్ పవర్ (solar power) ఇందుకు పూర్తి భిన్నం. అందువల్లే సోలార్ పవర్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్(surya Ghar) అనే పథకానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా సోలార్ ప్యానెల్స్.. ఇతర ఉత్పత్తులను రాయితీ మీద ప్రజలకు అందిస్తోంది. సోలార్ ప్లేట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తు ను సెంట్రల్ గ్రిడ్ కు అమ్ముకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. సోలార్ పవర్ ను ఉత్పత్తి చేయడానికి అనేక కంపెనీలు భారీగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే భారీగా సోలార్ పవర్ వెంచర్లు ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రుద్రంపూర్ ఏరియాలో అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా చవక పద్ధతుల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే మాత్రం సోలార్ పవర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలి.
Also Read : 75 ఏళ్లకు పైగా చెక్కుచెదరని చెట్టినాడు స్లర్రీ రోడ్.. అప్పటి అద్బుత పని తనానికి నిదర్శనం
తమిళనాడు రాష్ట్రంలో..
తమిళనాడు రాష్ట్రంలో ఓ యువకుడు చేసిన ప్రయోగం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏ ప్రాంతంలో ఇది చోటు చేసుకున్న తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం తెగ సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తోంది. ఓ యువకుడు ఇనప పేనం(తెలుగు రాష్ట్రాల్లో దీనిని ముకుడు అంటారు) లాంటి పాత్రకు వెండి వర్ణంలో ఉన్న ఓ షీట్ చుట్టాడు. దానిని ఎండలో స్టాండ్ కి పెట్టాడు. ఒక ప్లగ్ అమర్చాడు. ఆ తర్వాత మోటార్ ఆన్ చేశాడు. చూస్తుండగానే మోటర్ నీళ్లు పోస్తోంది. ఆ ఇనుప పేనం తీసివేయగానే ఆగిపోతుంది. అయితే ఇదంతా కూడా సోలార్ విధానం ద్వారా జరుగుతోందని ఆ యువకుడు చెప్పకనే చెప్పాడు. అయితే అంతటి సామర్థ్యం ఉన్న మోటర్ నడవాలంటే ఆ సోలార్ ప్లేట్ సరిపోదని.. అంతకుమించి కావాలని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. సోలార్ ప్లేట్ వెంటనే చార్జింగ్ కాదని.. దానికి కాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. ఆ వీడియోలో కనిపిస్తుంది అంతా ఫేక్ అని.. వాస్తవానికి అలా జరగదని కుండబద్దలు కొడుతున్నారు..” ఆ యువకుడు సోషల్ మీడియాలో హైప్ కోసం అలా చేసి ఉంటాడు. వాస్తవానికి అలా జరగదు. అలా జరగాలంటే ఆ ఒక్క సోలార్ ప్లేట్ సరిపోదు. పైగా ఎటువంటి సోలార్ ఫలకాలు లేకుండానే విద్యుత్ ఎలా బ్యాటరీలలో చార్జింగ్ అవుతుంది.. ఇలా పెట్టగానే సోలార్ పవర్ చార్జింగ్ కాదు. ఏదో అభూత కల్పనకు సంబంధించిన వీడియో లాగా ఉంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చూసేందుకు బాగుంటాయి. వాస్తవంలో పనికిరావు. ఆ వీడియో మొత్తం ఫేక్. మట్టిలో మాణిక్యం.. తమిళనాడు తేజమంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కానీ.. అదంతా పూర్తి అబద్దమని” సోలార్ విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read : ఉద్యోగం వదిలేశాడు.. జీవితాన్ని మార్చుకున్నాడు.. మునగతో ఏం చేశాడంటే..!
తమిళనాడు గ్రామాల్లో మట్టిలో మాణిక్యం
220v సౌర శక్తి ఉత్పత్తి చేస్తోన్న యువకుడు#SolarEnergy #TamilNadu #UANow pic.twitter.com/xODpX7Bzr5— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 26, 2025