https://oktelugu.com/

Vijay-Keerthi Suresh : భార్యకి విడాకులు ఇచ్చి హీరోయిన్ కీర్తి సురేష్ తో తమిళ హీరో విజయ్ డేటింగ్?

Vijay-Keerthi Suresh  : తమిళనాడు లో నెంబర్ 1 హీరో ఎవరు అంటే అందరూ విజయ్ పేరే చెప్తారు..ఎందుకంటే ఈయన నటిస్తున్న సినిమాలన్నీ భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి..కేవలం తమిళనాడు కి మాత్రమే తన మార్కెట్ ని పరిమితం చేసుకోకుండా విజయ్ కి ఈమధ్య టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది..ఇక ఓవర్సీస్ మార్కెట్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అక్కడ రజినీకాంత్ ని సైతం డామినేట్ చేసే రేంజ్ కి ఎదిగాడు విజయ్..అయితే కాసేపు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 24, 2023 / 08:35 PM IST
    Follow us on

    Vijay-Keerthi Suresh  : తమిళనాడు లో నెంబర్ 1 హీరో ఎవరు అంటే అందరూ విజయ్ పేరే చెప్తారు..ఎందుకంటే ఈయన నటిస్తున్న సినిమాలన్నీ భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి..కేవలం తమిళనాడు కి మాత్రమే తన మార్కెట్ ని పరిమితం చేసుకోకుండా విజయ్ కి ఈమధ్య టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది..ఇక ఓవర్సీస్ మార్కెట్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

    అక్కడ రజినీకాంత్ ని సైతం డామినేట్ చేసే రేంజ్ కి ఎదిగాడు విజయ్..అయితే కాసేపు ఆయన స్టార్ స్టేటస్, మార్కెట్ ఇవన్నీ పక్కన పెడితే విజయ్ గురించి ఒక ప్రముఖ తమిళ పత్రిక ప్రచురించిన ఒక కథనం ఇప్పుడు సంచలనంగా మారింది..సోషల్ మీడియా లో విజయ్ దురాభిమానులు ఈ కథనంని అడ్డం పెట్టుకొని విజయ్ పై విపరీతమైన ట్రోల్ల్స్ వేస్తున్నారు..అదేమిటంటే విజయ్ ప్రస్తుతం ఉంటున్న భార్య సంగీత తో త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నాడని తెలుస్తుంది.

    గత కొంత కాలంగా ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తో విజయ్ డేటింగ్ లో ఉన్నాడని..వీళ్లిద్దరు ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని..అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది..గతం లో వీళ్లిద్దరు కలిసి భైరవ మరియు సర్కార్ వంటి సినిమాల్లో నటించారు..ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది..వీటితో పాటుగా విజయ్ వ్యక్తిగత మ్యానేజర్ నిర్మిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

    అంతే కాకుండా కీర్తి సురేష్ కి విజయ్ అంటే ఎంత అభిమానమో చాలా సందర్భాలలో తెలిపింది..రీసెంట్ గా వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్న విషయం విజయ్ భార్య సంగీత పసిగట్టిందని..ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడాకులకు అప్లై చేసారని ఒక ప్రముఖ తమిళ వార్త పత్రిక ప్రచురించింది..దీనిపై కీర్తి సురేష్ మరియు విజయ్ స్పందిస్తారో లేదో చూడాలి.