
Tamannaah Bhatia: ‘వాల్తేరు వీరయ్య’ గ్రాండ్ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలుగా ప్రముఖ స్టార్ హీరోయిన్, నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ నటిస్తుండగా, హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది.
అయితే రీసెంట్ గా ప్లాన్ చేసిన ఒక్క షెడ్యూల్ లో కూడా తమన్నా కనిపించకపోవడం
పెద్ద చర్చకి దారి తీస్తుంది.సుమారుగా 50 రోజుల నుమి ‘భోళా శంకర్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది.మూవీ కి సంబంధించిన ప్రతీ ఒక్కరు షూటింగ్ లో పాల్గొన్నారు కానీ, తమన్నా మాత్రం ఇప్పటి వరకు పాల్గొనలేదు.
ఒరిజినల్ వెర్షన్ లో తమన్నా పోషించిన పాత్రని ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ చేసింది.అందులో ఆమె పాత్ర నిడివి ఎక్కువే, కానీ ఇక్కడ మాత్రం అసలు హీరోయిన్ ఊసే కనిపించకపోవడం తో తమన్నా ఈ చిత్రం నుండి తప్పకుండా అనే సందేహాలు తలెత్తాయి.ఆమె బదులు బుల్లితెర మీద టాప్ లీడింగ్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి ని హీరోయిన్ గా తీసుకున్నారనే రూమర్ కూడా సోషల్ మీడియాని ఊపేస్తోంది.ఇదే కనుక నిజం అయితే మెగా అభిమానుల నుండి ఒక రేంజ్ నిరసన సెగలు ఎదురుకోవాల్సి ఉంటుంది ఆ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్.

మొదటి నుండి మెహర్ రమేష్ కి సోషల్ మీడియా లో నెగటివిటీ ఎక్కువ, ఇలాంటి విచిత్రమైన ప్రయోగాలు చేస్తే మాత్రం సోషల్ మీడియా లో ఆయనని అభిమానులు బ్రతకనివ్వరు.కెరీర్ లో ఒక్క హిట్టు సినిమా కూడా లేని మెహర్ రమేష్ కి మెగాస్టార్ లాంటి టాప్ స్టార్ తో సినిమా చేసే అదృష్టం దక్కింది.ఈ అదృష్టాన్ని ఆయన సరిగ్గా వినియోగించుకుంటారో లేదో చూడాలి.