
Women’s T20 World Cup India vs Australia: సుధీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ, తొలి ప్రపంచ కప్ సాధించాలనే సంకల్పంతో టి20 ప్రపంచ కప్ బరి లోకి దిగిన టీమిండియా ఉమెన్స్ జట్టుకు అసలు సిసలైన సవాల్ ఇది. ఐదుసార్లు విశ్వవిజేత, ఒకసారి రన్నరప్ గా నిలిచిన నిలిచిన కంగారులతో హర్మన్ ప్రీత్ సేన నేడు దక్షిణాఫ్రికా దేశంలోని కేప్ టౌన్ వేదికగా జరిగే మ్యాచ్లో తలపడనుంది. 2020లోనూ ఇరు జట్లు తుది పోరులో తలపడ్డాయి. అయితే ఆస్ట్రేలియా అసాధారణ ఆట తీరు ప్రదర్శించడంతో కప్ గెలిచింది. ఇప్పుడు ఆ సెమీస్ లోనే భారత్ ఆ జట్టును ఢీ కొడుతోంది.
తడబడుతూ..
టి20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు ప్రయాణం తడబడుతూ సాగింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్లో భారత్ విషమ పరీక్ష ఎదుర్కోబోతోంది. గురువారం జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. గత టి20 వరల్డ్ కప్, కామన్వెల్త్ క్రీడల ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో హర్మన్ సేన ఓడిపోయింది.. ఇక గత ఓటములకు బదులు తీర్చుకునే సువర్ణ అవకాశం ఇది. కానీ అన్ని విభాగాల్లో పట్టిష్టంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవాలంటే టీమిండియా సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. టాప్ ఆర్డర్ లో నిలకడ లేమి తో పాటు స్ట్రైక్ రొటేట్ చేయలేకపోవడం జట్టును కలవరపెడుతుంది. రిచా మినహా మిగతా వారెవరు భారీ షాట్లు ఆడలేక పోతున్నారు. డాట్ బాల్స్ జట్టును తీవ్ర భక్తుడిలోకి నెట్టేస్తున్నాయి. ఓపెనర్ షపాలీ శర్మ గతం నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. హర్మన్ ప్రీత్ ఫామ్ లేమి జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.. ఇక ఈ మ్యాచ్లో కనుక ఇండియా ఓడిపోతే ఆమె సారథ్యం ముగిసినట్టే. జెమీమా రోడ్రిగ్స్ ఫర్వాలేదు అనిపిస్తున్నా.. జట్టు అవసరాల మేరకు ఇంకా రాణించాల్సి ఉంది..అయితే, స్టార్ బ్యాటర్ స్మృతి మందాన నిలకడగా ఆడుతున్నాడు జట్టుకు లాభించే విషయం.. ఇక బౌలింగ్ లో రేణుకా సింగ్ సత్తా చాటుతోంది. ఆమెకు తగిన సహకారం మాత్రం కరువైంది.. ఇక స్పిన్నర్ దీప్తి శర్మ ధారాళంగా పరుగులు ఇస్తోంది.. ఇది జట్టుకు ఇబ్బందికరంగా మారింది.

ఆస్ట్రేలియాలో ఆత్మవిశ్వాసం
మరోవైపు గ్రూప్ దశలో ఆడిన ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్ ల్లోనూ గెలిచింది. ఈ విజయాలతో లానింగ్ సేనలో ఆత్మవిశ్వాసం తొణికసలాడుతోంది. ఏడుగురు బ్యాటర్లు, నలుగురు పేపర్లతో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తోంది.. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియా ఫేవరెట్ జట్టుగా కనిపిస్తోంది.. మరొక గత ప్రపంచకప్ లో భారత్ ను ఓడించి ఒడిసి పట్టింది.. ఆస్ట్రేలియాను నిలువరించాలంటే, కప్ గెలవాలి అంటే భారత్ అసాధారణ ప్రదర్శన చేయాలి. ఇక 2021 ఏప్రిల్ నుంచి ఆడిన 21 టీ 20ల్లో ఆసీస్ ఒక్కటే ఓడింది. అదీ భారత్ చేతిలో సూపర్ ఓవర్లో..
జట్ల అంచనా ఇలా
భారత్: షపాలీ, స్మృతి, రిచా ఘోష్, జెమీమా, దీప్తి, పూజ, శిఖా పాండే, రాధా యాదవ్, రాజేశ్వరి, రేణుక.
ఆస్ట్రేలియా: హీలే, మూనీ, లానింగ్, ఎలీస్, గార్డ్ నర్, తహ్లియా, గ్రేస్, జార్జియా, అలన్ కింగ్, స్కట్, డార్సీ బ్రౌన్.
