Swiggy Insta Mart : ముందుగానే చెప్పినట్టు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంలో ఏర్పాటు అయ్యాయి. అందులో పని చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి నిపుణులు వచ్చారు. వారంతా హైదరాబాదులో స్థిరపడ్డారు. హైదరాబాద్ వాళ్లంటే పూర్తి సౌత్ ఇండియన్ కల్చర్ ప్రదర్శిస్తారు.. మనదేశంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా హైదరాబాదులో ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇక ఇతర విభాగాల్లోనూ వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ ప్రజలు తమ కల్చర్ ను మర్చిపోలేదు. ముఖ్యంగా న్యూ ఇయర్, హోలీ ఇటువంటి పండుగలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. ఇక న్యూ ఇయర్ లో హైదరాబాదులో బిర్యాని అమ్మకాలు తారాస్థాయికి చేరాయి. మద్యం విక్రయాలు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. మందు, విందు జరిగిన తర్వాత.. చాలామంది కోరుకునేది పొందే కాబట్టి.. హైదరాబాద్ జనాలు దానికే ఓటేశారు. ఆ రూమ్ లను ఆన్లైన్లో బుక్ చేసుకుని.. స్విగ్గి ద్వారా ఆ ప్యాకెట్లు ఆర్డర్ చేసుకొని దర్జాగా ఎంజాయ్ చేశారు.
స్విగ్గి నివేదిక ఏం చెబుతోంది అంటే..
డిసెంబర్ 31 ముగిసిన తర్వాత స్విగ్గి ఇన్ స్టా మార్ట్ తన నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 31, జనవరి ఒకటి తేదీల్లో తమ ఇన్ స్టా పార్ట్ ద్వారా భారీగా ఆ ప్యాకెట్లు ఆర్డర్ వచ్చినట్టు పేర్కొంది. మంగళవారం సాయంత్రం వరకే దాదాపు 4779 ప్యాకెట్లు బుక్ అయ్యాయని పేర్కొంది. ఇక జనవరి ఒకటో తేదీ నాడు ఆ సంఖ్య రెట్టింపు అయిందని పేర్కొంది. ఇక ఆ ప్యాకెట్లతోపాటు 2.21 లక్షల చిప్స్ ప్యాకెట్లను హైదరాబాద్ ప్రజలు ఆర్డర్ చేశారని వివరించింది. తమకు వచ్చిన ఇన్ స్టా ఆర్డర్లలో ప్రతి ఎనిమిదిలో ఒకటి ఇతరుల కోసమే చేసినవని స్విగ్గి పేర్కొంది. మదర్స్ డే, వాలంటైన్స్ డే కంటే ఈ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ” చాలామంది యూత్ బిర్యాని ఆర్డర్ చేశారు. ఆ తర్వాత ఆ ప్యాకెట్లను బుక్ చేసుకున్నారు. ఇన్ స్టా అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇలా దాదాపుగా పదివేల వరకు ఆ ప్యాకెట్లను మేము విక్రయించాం. ఆ ప్యాకెట్లు ఆర్డర్ చేసిన వారు.. చిప్స్ ప్యాకెట్లను.. ఇతర బాడీ స్ప్రేలను కూడా కొనుగోలు చేశారు. మొత్తంగా ఆ ప్యాకెట్లతో, చిప్స్ ప్యాకెట్లతో వారు న్యూ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని మేము భావిస్తున్నామని” స్విగ్గి ఇన్ స్టా మార్ట్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నాయి.