Gautam Gambhir : రోహిత్ ఇలా ఆడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా #happy retirement అనే యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి.. “ఇక ఆడింది చాలు.. జట్టు విజయాలను నాశనం చేసింది చాలు.. రిటైర్మెంట్ తీసుకో.. హాయిగా కుటుంబంతో గడుపు” అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. దీనిపై రోహిత్ అభిమానులు మండిపడుతున్నప్పటికీ.. నెటిజన్లు వేసే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ విషయం రోహిత్ కు కూడా అర్థమైనట్టుంది. అందువల్లే బ్రిస్ బేన్ టెస్టులో అవుట్ ఆయన తర్వాత తన గ్లవ్స్, బ్యాట్ విసిరి కొట్టాడు. ఆ తదుపరి టెస్ట్ లోనూ అతడు కొత్తగా ఆట తీరును ప్రదర్శించలేకపోయాడు. సేమ్ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. టీమిండియా దారుణంగా ఓడిపోవడానికి రోహిత్ విఫల ప్రదర్శన కూడా ప్రధాన కారణం. ముఖ్యంగా మెల్ బోర్న్ టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్ లో రోహిత్ నిదానంగానే ఆడినప్పటికీ.. ఆ తర్వాత అతడు మళ్లీ తన పాత ఆట తీరునే ప్రదర్శించాడు. రోహిత్ మాత్రమే కాకుండా విరాట్, రాహుల్, రవీంద్ర జడేజా అలానే ఆడటంతో డ్రెస్సింగ్ రూమ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందట. గౌతమ్ గంభీర్ సీనియర్ ఆటగాళ్లపై మండిపడ్డాడట. ఈ పరిణామాలపై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.
గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే..
టెస్ట్ మ్యాచ్ కు ముందు విలేకర్ల సమావేశం నిర్వహిస్తారు. జట్టులో తీసుకున్న మార్పులను విలేకరులకు వెల్లడిస్తారు. అయితే సిడ్ని వేదికగా జరిగే టెస్టులో రోహిత్ ఆడతాడా? అతడు కెప్టెన్ గానే ఉంటాడా? అతడి స్థానంలో మరెవరినైనా ఆడిస్తారా? అని విలేకరులు ప్రశ్నించారు. దానికి గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.. ” సిడ్నీ టెస్ట్ మాకు అత్యంత ముఖ్యం. ఇక్కడ గెలిస్తేనే మా జట్టుకు తదుపరి అవకాశాలుంటాయి. గతంలో ఏం జరిగిందనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఏం చేయాలి అనేదానిపై మేము దృష్టి సారించాం. రోహిత్ శర్మ శుక్రవారం ఆడతాడా? లేదా? అనేది రేపు తెలుస్తుందని” గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. గౌతమ్ గంభీర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. జట్టులో శుక్రవారం నాటి మ్యాచ్ కు సంబంధించి పెను మార్పులు చోటు చేసుకుంటాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. “దారుణమైన ఫామ్ కొనసాగిస్తున్న నేపథ్యంలో.. సిడ్నీ టెస్టులో టీమిండియా గెలవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.. అందువల్లే రోహిత్ ను పక్కన పెడతారు కావచ్చు.. అతడి స్థానంలో బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తాడు అనుకుంటా. ఎందుకంటే బుమ్రా నాయకత్వంలో టీమిండియా పెర్త్ టెస్ట్ గెలిచింది. రోహిత్ నాయకత్వం వహించిన మిగతా మ్యాచ్లను భారత్ ఓడిపోయిందని” క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.