Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: ఏపీలో దారుణం.. పార్టీలు పౌరుషాలు.. వెలేసేంతగా గ్రామాలు విభజింపబడుతున్నాయా?

AP Politics: ఏపీలో దారుణం.. పార్టీలు పౌరుషాలు.. వెలేసేంతగా గ్రామాలు విభజింపబడుతున్నాయా?

AP Politics: ఏపీలో రాజకీయ పగ, ప్రతీకారాలు కొనసాగుతున్నాయి. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రత్యర్థులను దారుణంగా భయపెట్టారు. భయాందోళనకు గురి చేశారు. స్థానిక సంస్థలను సైతం ఏకపక్షంగా కైవసం చేసుకున్నారు. అయితే కాలం ఒకేలా ఉండదు. వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడింది. ప్రతిపక్షాలు కూటమికట్టాయి. ఘనవిజయం సాధించాయి. అయితే వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో ఆ పార్టీకి చెందిన నేతలు గుడ్ బై చెబుతున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వైసీపీ హవా నడుస్తోంది. దానికి కారణం స్థానిక సంస్థలు వారి చేతుల్లోనే ఉండడం. సాధారణంగా పెద్ద నేతలు పార్టీలు మారుతుంటారు. వారు వెళ్లిపోయినంత సులువుగా కిందిస్థాయిలో ఉన్న నేతలు మాత్రం.. పార్టీలు మార్చేందుకు ఇష్టపడరు. వారు ఆరు నూరైనా.. నూరు ఆరైనా సొంత పార్టీలోనే కొనసాగేందుకు ఇష్టపడతారు.

* ఏడు కుటుంబాలు వెలి
పెద్ద పెద్ద నాయకులు.. వందల కోట్ల రూపాయలు లబ్ధి పొందిన వారు సైతం రాత్రికి రాత్రే పార్టీ మార్చేస్తున్నారు. కానీ దిగువ స్థాయిలో మాత్రం ఇంకా మొండి పట్టుదల కొనసాగుతోంది. ఈ క్రమంలో పగలు, ప్రతీకార రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని ఉప్పు మిల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏడు కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేశారు. గ్రామస్తులు వారికి ఎలాంటి సహకారం అందించకూడదని.. వారి శుభకార్యాలకు పిలిచిన వెళ్ళకూడదని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వీరంతా గ్రామం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. వైసీపీ ప్రభావం ఎక్కువగా ఉండే గ్రామం కావడంతో గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. బాధిత కుటుంబాలు కాకినాడ కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

* అధికారుల విచారణ
ఈ ఘటనపై కాకినాడ కలెక్టర్ స్పందించారు. క్షేత్రస్థాయిలో అధికారులను గ్రామానికి పంపించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది ఇలా ఉంటే అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కుటుంబాలను ఎలా బహిష్కరించారని అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? తెర వెనుక ఏం జరిగిందనేది ఆరా తీస్తున్నారు అధికారులు. పెద్ద పెద్ద నాయకులే పార్టీ మారిపోతున్న ఈ పరిస్థితుల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వివక్ష, వెలివేసే రుగ్మత కొనసాగుతుండడం విచారకరం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version