Homeట్రెండింగ్ న్యూస్Sweden Job Benefits: ఉద్యోగం వదిలేసినా జీతం.. ఈ ఉద్యోగుల అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్...

Sweden Job Benefits: ఉద్యోగం వదిలేసినా జీతం.. ఈ ఉద్యోగుల అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Sweden Job Benefits: స్వీడన్‌ సంపన్న దేశాలలో ఒకటి. మన దేశంలో అక్రమంగా డబ్బు సంపాదించిన పెద్దపెద్ద అవినీతిపరులు, నేతలు స్వీడన్‌ బ్యాంకుల్లోనే దాచిపెడుతుంటారు. ఇక ఈ దేశంలో ఉద్యోగులకు అందించే సౌకర్యాలు, సంక్షేమ పథకాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణించబడతాయి. ఉద్యోగ జీవితంలో సమతుల్యత, ఆరోగ్యం, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యమిచ్చే ఈ దేశం, ఉద్యోగులకు అనేక అసాధారణ ప్రయోజనాలను అందిస్తోంది.

Also Read: చుట్టూ శత్రువలే.. అయినా ఇప్పటి వరకూ ఓటమెరుగని దేశం.. ఇజ్రాయెల్ విజయరహస్యమిదీ

స్వీడన్‌లో ఉద్యోగులకు సంవత్సరానికి కనీసం 25 రోజుల శాలరీడ్‌ లీవ్‌ (వేతనంతో కూడిన సెలవు) లభిస్తుంది. కొన్ని కంపెనీలు దీన్ని 30 రోజుల వరకు కూడా అందిస్తాయి. ఈ సెలవుల సమయంలో ఉద్యోగులు తమ కుటుంబంతో సమయం గడపడం, విశ్రాంతి తీసుకోవడం లేదా ప్రయాణాలు చేయడం వంటివి చేయవచ్చు. ఈ విధానం ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్వీడన్‌లోని కొన్ని సంస్థలు ‘సమ్మర్‌ లీవ్‌‘ సీజన్‌లో అదనపు సెలవులను కూడా అందిస్తాయి, ఇది జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. ఈ సమయంలో దేశంలోని సుందరమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఉద్యోగులను ప్రోత్సహిస్తారు.

పండగల సమయంలో హాఫ్‌–డే సెలవులు
పండగలకు ముందు రోజు స్వీడన్‌లో సాధారణంగా అర్ధ రోజు సెలవు ఇవ్వబడుతుంది. ఉదాహరణకు, క్రిస్మస్‌ ఈవ్‌ లేదా మిడ్‌సమ్మర్‌ వంటి ప్రధాన పండగలకు ముందు రోజు, ఉద్యోగులు మధ్యాహ్నం నుంచి సెలవు తీసుకోవచ్చు. ఇది వారికి పండగ సన్నాహాలు, కుటుంబ సమావేశాలకు తగిన సమయాన్ని అందిస్తుంది. ఈ హాఫ్‌–డే సెలవులు ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించడమే కాక, స్వీడన్‌లోని సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే విధానాన్ని ప్రతిబింబిస్తాయి.

జాయినింగ్‌ బోనస్‌.. ల్యాప్‌టాప్, ఐఫోన్‌లతో స్వాగతం
స్వీడన్‌లోని అనేక టెక్‌ కంపెనీలు, ఇతర పరిశ్రమలు కొత్త ఉద్యోగులకు జాయినింగ్‌ బోనస్‌గా లేటెస్ట్‌ మోడల్‌ ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తాయి. ఇది ఉద్యోగులకు అవసరమైన సాంకేతిక సాధనాలను సమకూర్చడమే కాక, వారిని సంస్థలో భాగంగా స్వాగతించే విధానంగా కూడా పనిచేస్తుంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వారి ఇష్టానుసారం డివైస్‌లను ఎంచుకునే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాయి, ఇది వారి సౌకర్యాన్ని, పని సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.

ఆరోగ్య సంరక్షణకు ఆర్థిక సాయం
స్వీడన్‌లో ఉద్యోగుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. జిమ్‌ సభ్యత్వం, మసాజ్‌ సేవలు, యోగా క్లాసుల కోసం నెలకు దాదాపు రూ.40 వేల వరకు ఆర్థిక సాయం అందించబడుతుంది. ఈ సౌకర్యం ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. స్వీడన్‌లోని ‘ఫ్రిస్క్‌వర్డ్‌‘ (Friskvard) అనే సంక్షేమ పథకం కింద ఈ ఆర్థిక సాయం అందించబడుతుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు స్విమ్మింగ్, డ్యాన్స్‌ క్లాసులు, స్పా సేవల కోసం కూడా ఉపయోగించవచ్చు.

ఉద్యోగం వదిలినా ఆర్థిక భద్రత..
స్వీడన్‌లో ఉద్యోగం నుంచి వైదొలగడం లేదా తొలగించబడడం వంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు ఆర్థిక సాయం అందించబడుతుంది. కనీసం 9 నెలల పాటు నెలకు రూ.10 వేల వరకు నిరుద్యోగ భృతి (unemployment benefit) లభిస్తుంది. ఈ విధానం ఉద్యోగులకు కొత్త ఉద్యోగం కోసం సమయం, ఆర్థిక భద్రతను అందిస్తుంది. స్వీడన్‌లోని ‘A-kassa అనే నిరుద్యోగ భీమా పథకం ద్వారా ఈ సాయం అందించబడుతుంది. ఉద్యోగులు ఈ పథకంలో సభ్యత్వం పొందడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఆదర్శంగా తీసుకోవచ్చా?
స్వీడన్‌లోని ఈ ఉద్యోగ సంక్షేమ విధానాలు భారతీయ ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తున్నాయి. భారత్‌లోనూ కొన్ని బహుళజాతి సంస్థలు ఇలాంటి సౌకర్యాలను అందిస్తున్నప్పటికీ, స్వీడన్‌లో వీటిని దాదాపు అన్ని సంస్థలు, చిన్న కంపెనీలు కూడా అమలు చేయడం విశేషం. ఈ విధానాలు ఉద్యోగుల సంతృప్తిని, ఉత్పాదకతను పెంచడమే కాక, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version