https://oktelugu.com/

CC Camera : బర్రె పై అనుమానం.. సీసీ కెమెరాలు పెట్టిన రైతుకు షాక్ దృశ్యం

బర్రెపై సీసీ కెమెరా ప్రయోగం ఏంటంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మూగజీవిపై ఈ వికృత చర్యలేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ జీవహింస కింద వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 17, 2023 / 06:21 PM IST
    Follow us on

    CC Camera : ఇటీవల సీసీ కెమెరాల వినియోగం గణనీయంగా పెరిగింది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతిచోట వినియోగిస్తున్నారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, వ్యాపార సముదాయాలు, ఆలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, చిన్నచిన్న దుకాణాల్లో సైతం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల వినియోగంతో నేర నియంత్రణ సులువవుతోంది. నేరాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. అందుకే సీసీ కెమెరాలు రూపొందించే సంస్థలు తమ సేవలను మరింత సరళతరం చేశాయి. తక్కువ ధరకే వాటిని అందిస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది వాటిని వినియోగిస్తున్నారు.

    అయితే ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. తన ఇంట్లో ఉన్న బర్రెపై నిఘా పెట్టాలని చూశాడు. పశువుల శాల ప్రాంగణంలో సీసీ కెమెరాను అమర్చాడు. బర్రె కదలికలు తెలుసుకోవాలన్న ప్రయత్నంలోనే ఆ పనిచేశాడు. ఇలా రెండురోజుల తరువాత పుటేజీలను పరిశీలిస్తే షాకింగ్ విషయాలు తెలిశాయి. రాత్రిపూట బర్రె తనకు తాను మెడకు ఉన్న తాడు (కన్నె) తెంపుకొనిపోవడం అతడికి కనిపించింది. పక్క శాలలో ఉన్న గడ్డి మేయడం చూశాడు. అయితే ఇది ఒకటి రెండు రోజులు జరగలేదు. ప్రతీరోజూ ఇదే తంతు. అందులో విశేషమేమిటంటే రాత్రిపూట తాడును తెంపుకొని పోతున్న బర్రె ఉదయానికి అదే ప్లేస్ లోకి వచ్చి నిలబడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    కానీ నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. బర్రెపై సీసీ కెమెరా ప్రయోగం ఏంటంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మూగజీవిపై ఈ వికృత చర్యలేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ జీవహింస కింద వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే అది ఓ ఛానల్ వీడియో కింద సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నా మాటలు మాత్రం వినిపించడం లేదు. ఆ ఘటన ఎక్కడిదో కూడా తెలియడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.