https://oktelugu.com/

Love Story : ఆమెకి 40, అతడికి కేవలం 20 ఏళ్లే.. వీళ్ల సంసారం సీక్రెట్స్ హైలెట్

నాకంటే 20 సంవత్సరాల పెద్ద అన్న నామూషీ లేదు. ప్రేమ, అప్యాయత పంచడంతో నా మైండ్ లోకి ఇతర విషయాలు రావు. మా దాంపత్యం జీవిత చరమాంకం వరకూ ఇలానే గడిచిపోతుందన్న నమ్మకం ఉంది’ 

Written By:
  • Dharma
  • , Updated On : June 17, 2023 / 06:28 PM IST
    Follow us on

    Love Story : మనిషి జీవితంలో కలకాలం ఉండాల్సిన బంధం.. దాంపత్యం. తల్లిదండ్రులు వివాహం వరకే మనతో ఉంటారు. పిల్లలు సైతం వారి వివాహాల వరకే మనతో గడుపుతారు.  జీవిత చరమాంకం వరకూ ఒకరికొకరు తోడుగా నిలిచేది దాంపత్యమే. అందుకే జీవిత భాగస్వామి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొత్త ఆశలతో జీవితం గడిపేవారు ఇలా ఉండాలని, అందంగా ఉండాలని..వయసు కూడా రమారమి దగ్గరగా ఉండాలని  ఎక్కువ మంది కలలుకంటారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదే. కానీ 20 ఏళ్ల కుర్రాడు.. 40 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాడు. అవి ఆయన మాటల్లోనే..

    ‘నాకు చిన్నవయసులోనే ఉద్యోగం వచ్చింది. చేతినిండా సంపాదనే. నా ఉన్నత పాఠశాల స్థాయిలోనే ఓ యువతి అంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం ఆమెతోనే చాలాసార్లు చెప్పా. పదో తరగతి, ఆపై ఇంటర్ చదివాను. ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించాను. వెంటనే ఎన్డీఏలో ప్రవేశంతో ఉద్యోగం పొందాను. కానీ నేను ప్రపోజ్ చేయడంతో ఆమె నా కోసం వెయిట్ చేసింది. నాకు మించిన ప్రేమ ఆమెలో వ్యక్తమైంది. కానీ దాదాపు 20 ఏళ్లు మా మధ్య గ్యాప్. దీంతో ఇరు కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ అందర్నీ ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను. ఎంతో ప్రేమ, అప్యాయతతో కూడిన దాంపత్యాన్ని అనుభవిస్తున్నాను’…

    నేనంటే ఆమెకు చాలా ఇష్టం. నా కోసం చాలా ఇష్టాలనే విడిచిపెట్టింది. నా ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకుంది. తనకు నాన్ వేజ్ అలవాటు లేదు. కానీ నా కోసం అలవాటు చేసుకుంది. వంట నేర్చుకుంది. నా కోసం చీరలు కాకుండా డ్రస్ వేసుకుంది. దూర ప్రాంతంలో ఉన్నా నా బాగోగులు చూసుకుంటుంది. సమయానికి టిఫిన్, భోజనం చేశానో? లేదో? అని గుర్తుచేస్తుంటుంది. మా మధ్య వయసు భేదమన్న మాటే లేదు. నాకంటే 20 సంవత్సరాల పెద్ద అన్న నామూషీ లేదు. ప్రేమ, అప్యాయత పంచడంతో నా మైండ్ లోకి ఇతర విషయాలు రావు. మా దాంపత్యం జీవిత చరమాంకం వరకూ ఇలానే గడిచిపోతుందన్న నమ్మకం ఉంది’