
Suriya-Ram Charan Multistarrer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ర్ ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో మామూలుగా లేదు, మొదటి నుండి పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ ని ఉన్న రామ్ చరణ్ ని #RRR చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ కి తీసుకెళ్లింది.ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సైతం రామ్ చరణ్ ని తమ సినిమాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు.
రీసెంట్ గానే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రం లో ఒక పాటలో సల్మాన్ ఖాన్ తో కలిసి చిందులేసిన రామ్ చరణ్, షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రం ‘జవాన్’ లో కూడా ఒక ముఖ్య అతిథి పాత్ర చేస్తున్నాడు.ఇప్పుడు తమిళ హీరో సూర్య కన్ను కూడా రామ్ చరణ్ మీద పడింది.
ఇక అసలు విషయానికి వస్తే ‘సీత రామం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి తమిళ హీరో సూర్య తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతోంది.ఇటీవలే చెన్నై కి వెళ్లి సూర్య ని కలిసి స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నాడట హను.కథలో ఒక కీలక పాత్ర పోషించడానికి కచ్చితంగా ఒక సూపర్ స్టార్ చెయ్యాల్సిన అవసరం ఉంది.

ఆ పాత్ర కోసం రామ్ చరణ్ ని అడగమని సూర్యనే చెప్పాడట.ప్రస్తుతం అమెరికా లో ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరవ్వడానికి వెళ్లిన రామ్ చరణ్, తిరిగి ఇండియా కి వచ్చిన వెంటనే స్టోరీ వినిపించబోతున్నాడట హను రాఘవపూడి.సూర్య మరియు రామ్ చరణ్ ఇద్దరి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది.ఒకరిని ఒకరు ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు.కాబట్టి రామ్ చరణ్ కూడా కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడని అందరూ అనుకుంటున్నారు.చూడాలి మరి ఈ కాంబినేషన్ సెట్ అయితే మూవీ లవర్స్ కి కనుల పండుగే అని చెప్పొచ్చు.
