Pappu Chaiwala: చాయ్ వాలా.. మోదీ ప్రధాని అయ్యాక చాయ్ వాలాల ఇమేజ్ అమాంతం పెరిగింది. పదేళ్ల క్రితం చాయ్ వాలా అంటే.. పొట్ట తిప్పలకు పెట్టుకునే వారు అనుకునే వారు.. 2014లో నరేంద్రమోదీ ప్రధాని కావడం, చాయ్ వాలాగా ప్రస్థానం ప్రారంభించి ప్రధాని పీఠం అధిష్టించినట్లు మోదీ స్వయంగా చెప్పడంతో చాయ్ వాలాలు చాలా గర్వంగా భావించారు. ఇక అప్పటి నుంచి చాయ్ వ్యాల్యూ కూడా పెరిగింది. దీంతో అనేక కంపెనీలు టీ హబ్, టీ పాయింట్, టీ టైం.. అంటూ అనేక పేర్లతో చిన్న చిన్న పట్టణాల్లో స్మార్ట్ టీపాయింట్లు తెరిచాయి. పదేళ్లలో వేలాది టీ షాప్స్ ఓపెన్ అయ్యాయి. ఇక టీ వాలాలు కూడా తమలోని టాలెంట్ చూపుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్‌గేట్స్‌కు టీ అందించి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు డాలీ చాయ్ వాలా. సోషల్ మీడియాలో ఇతను చాలా పాపులర్. బిల్‌గేట్స్ టీ తాగిన తర్వాత అతని వీడియోలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యాయి. బిల్ గేట్స్ ఇండియాకు వచ్చినప్పుడు.. డాలీ టీ స్టాల్ దగ్గరికి వెళ్లి చాయ్ తాగిన వీడియోకు లక్షల వ్యూస్ వచ్చాయి.
ఇప్పుడు గుజరాత్ చాయ్ వాలా..
గుజరాత్ చాయ్‌వాలా మోదీ ప్రధాని అయ్యాడు. ఇప్పుడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మరో చాయ్‌వాలా పప్పు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. తన టాలెంట్‌తో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. దీంతో డాలీ చాయ్ వాలాకు దీటుగా పప్పు చాయ్ వాలా వీడియోస్‌కు వ్యూస్ వస్తున్నాయి.
వెరైటీగా టీ తయారీ..
సూరత్‌లో న్యూసిటీ లైట్ రోడ్ ప్రాంతంలో ఈ పప్పు చాయ్‌వాలా దుకాణం ఉంది. పప్పు చాయ్‌వాలా టీ పెడుతున్న స్టైల్ వెరైటీగా ఉంది. అతను పాల ప్యాకెట్లను గాల్లోకి ఎగరేస్తూ పట్టుకోవడం, పాలను ఎత్తు నుంచి గిన్నెలో పోయడం వంటివి మరో యాక్షన్ చాయ్‌వాలాగా గుర్తింపు తెచ్చాయి. ఇతను తయారు చేసిన టీ మరీ స్పెషల్‌గా కూడా ఉంటుంది. పాలల్లో పుదీనా, లెమన్ గ్రాస్, అల్లం, టీపొడి వంటివి వేసి మరగబెడుతున్నాడు. అందులో చక్కెర, ఇతర పదార్థాలు వేస్తున్నాడు. చివరకు వడగట్టి టీ సిద్ధం చేస్తున్నాడు. చాలాకాలంగా పప్పు చాయ్‌వాలా ఇలా టీ తయారు చేస్తున్నాడు. అయితే ఇటీవల అక్కడికి వచ్చిన ఓ కస్టమర్ పప్పు చాయ్‌వాలా టీ తయారు చేసే విధానాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లోల వైరల్ అవుతోంది. వేలాది వ్యూస్ వస్తున్నాయి. వందలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram