Anand Mahindra: మనం తాగే నీరు ఎంతవరకు స్వచ్ఛమైనది? పోనీ మనం తాగుతున్న నీరు స్వచ్ఛమైనదేనా? ఇంట్లో వాడుతున్న ఫ్రిడ్జ్ మన నీటిని సురక్షితంగా ఉంచగలదా? ఈ అనుమానం ఒక నెటిజన్ కు వచ్చింది. దాంతో అతడు మట్టి కుండ, ఫ్రిడ్జ్ ను పోల్చుతూ ఒక ట్వీట్ చేశాడు. దానిని చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ చేశారు. తనలో ఉన్న పారిశ్రామికవేత్తను పక్కనపెట్టి మట్టికుండకు సంబంధించిన ఉపయోగాలు రెండు ముక్కల్లో చెప్పేశారు.
ఇలా బదులిచ్చాడు
ఫ్రిడ్జ్ గొప్పదా? మట్టి కుండ గొప్పదా? రెండింటి మధ్య తేడాలను వివరిస్తూ ఓ ప్రొఫెసర్ ట్వీట్ చేశాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు కూడా ఈ ట్విట్ ఆసక్తికరంగా కనిపించింది. వెంటనే సదరు ప్రొఫెసర్ పెట్టిన రీ ట్వీట్ చేస్తూ మట్టి కుండ గొప్పదనం గురించి తనదైన శైలిలో వివరించాడు. ” ఇది స్పష్టమైన, తేలికైన పోలిక. శక్తివంతమైన ఫ్రిడ్జ్ అంతరించిపోయే ప్రమాదం లేదు” అని వ్యాఖ్యానించాడు. ప్రొఫెసర్ బోల్ నాథ్ దత్తా చేసిన ట్వీట్ ను ఉటంకిస్తూ ఆనంద్ మహీంద్రా ఈ ట్వీట్ చేశాడు. ఆనంద్ మహీంద్రా సరదాగా ట్వీట్లు చేయడం, ఇతర విషయాలపై స్పందించడం ఇదే కొత్త కాదు. ఆయనకు ఏదైనా ఆసక్తికరంగా అనిపిస్తే వెంటనే తనదైన శైలిలో సమాధానం ఇస్తాడు. చతురత కూడిన భాష ఉపయోగిస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటాడు.
ఇంతకీ ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే
బోల్ నాథ్ దత్తా అనే వ్యక్తి ప్రొఫెసర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే ఈయన ట్విటర్లో ఫ్రిడ్జ్ గొప్పదా? మట్టి కుండ గొప్పదా అనే ప్రశ్నను లేవనెత్తారు. ఫ్రిడ్జ్ బహుళ పనులు చేస్తుందని, మట్టి కుండ మాత్రం నీటిని చల్లగా ఉంచేందుకు మాత్రమే దోహదపడుతుందని వ్యాఖ్యానించాడు. అయితే ఇదే సందర్భంలో ఆనంద్ మహీంద్రా కల్పించుకుని మట్టి కుండ నీటిని చల్లగా ఉంచడమే కాకుండా అందులోని మలినాలను శుభ్ర పరుస్తుందని అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. అయితే చివరికి సదరు ప్రొఫెసర్ బోల్ నాథ్ దత్తా ఆనంద్ మహీంద్రా తో ఏకీభవించాడు. ” సర్ నా ఉద్దేశం అది కాదు. ఫ్రిడ్జ్ బహుళ విధులు నిర్వర్తిస్తుంది. ఇందులో సందేహం లేదు. కానీ ఫ్రిడ్జ్ ఉన్నవారు కూడా మట్టికుండను వినియోగిస్తారు. ఎండాకాలంలో మట్టి కుండ నీళ్లను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది” అని ఆనంద్ మహీంద్రా కు వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కుండలోనే నీటిని వాడుతారు
ఆనంద్ మహీంద్రా మట్టి కుండ గురించి ఊరకే చెప్పలేదు. ఎందుకంటే మహీంద్రా అనేది అతిపెద్ద కార్పొరేట్ సామ్రాజ్యం అయినప్పటికీ.. వేసవికాలంలో తమ కార్యాలయాల్లో ఫ్రిడ్జిలతో పాటు కుండలను కూడా వినియోగిస్తారు. నీటిని చల్ల పరచడంతో పాటు, మాలినాలు లేకుండా శుభ్రం చేస్తుందని మహీంద్రా యాజమాన్యం నమ్మకం. ఉద్యోగులు కూడా కుండల్లోని నీరునే ఇష్టంగా తాగుతారు. చాలామంది ఆనంద్ మహీంద్రా పెద్ద కార్పొరేట్ సంస్థకు యజమాని అనుకుంటారు కానీ.. ఆయన ట్విట్టర్లో ట్వీట్లు చూస్తే.. సాధారణంగా మన ఇంటి పక్క ఉండే మామూలు మధ్యతరగతి కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడిలాగా కనిపిస్తాడు. అందుకే మిగతా కార్పొరేట్ల కంటే ఆనంద్ మహీంద్రా పూర్తి విభిన్నమైన క్యారెక్టర్. అందుకే రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేయగలడు. ఆ సినిమా దర్శకుడు రాజమౌళితో సింధు నాగరికత గురించి మీరు ఎందుకు సినిమా తీయకూడదూ అని ప్రశ్నించగలడు.
Frankly, the Surahi is also superior from the point of view of design & aesthetics. In a world increasingly preoccupied with being planet-positive, the humble Surahi could become a premium lifestyle accessory. (credit: @EducatedMoron) pic.twitter.com/SR2M7sSMxU
— anand mahindra (@anandmahindra) May 9, 2023