Superstar Krishna Records: సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ. అలనాడు జేమ్స్ బాండ్ పాత్ర ఇంగ్లీస్ సినిమాల్లోనూ చూసేవారు. ఇలాంటి పాత్రలో తెలుగువారు కూడా నటించొచ్చు అని కృష్ణ నిరూపించారు. ఆ పాత్రలో ‘మోసగాళ్లకు మోసగాడు’ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. కేవలం ఈ సినిమానే కాకుండా తెనే మనుసులు, సింహాసనం, అల్లూరి సీతారామరాజు తదితర సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి కృష్ణ ఆకట్టుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ చేయని రికార్డులు నెలకొల్పి అందరినీ శోకసంద్రంలో ముంచి కృష్ణ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన సాధించి రికార్డుల గురించి తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. టెక్నాలజీని విపరీతంగా వాడుకొని ఆయన విభిన్న చిత్రాల్లో నటించారు. ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ చిత్రంలో నటించిన మొదటి నటుడు కూడా కృష్ణనే. 1965లో అదుర్తి సుబ్బారావు కొత్త నటులతో సినిమాను తెరకెక్కించారు. ఇది సూపర్ స్టార్ కృష్ణకు మొదటి సినిమా. ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ అయిన ఈ మూవీ పలు కేంద్రాల్లో వందరోజుల నడిచింది.
తెలుగులో మొదటిసారి కౌభాయ్ పాత్ర వేసింది కృష్ణ మాత్రమే. 1971లో మోసగాళ్లకు మోసగాడు అనే సినిమాను కే.ఎస్ .ఆర్. దాసు డైరెక్షన్ చేశారు. ఈ సినిమా పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. అంతేకాకుండా హాలీవుడ్లో రిలీజైన తొలి భారతీయ సినిమాగా రికార్డులోకెక్కింది. అంటే అప్పుడే కృష్ణ పాన్ ఇండియా హీరో అన్నమాట. ఇలాగే 1972లో తొలి ORW కలర్ సినిమా ‘గూడపుఠానీ’లో కృష్ఖ నటించారు. అలాగే 1976లో తొలి పూజీ కలర్ సినిమాను కృష్ణ నే దక్కించుకున్నాడు. ఈ సినిమాను కే.ఎస్ .ఆర్. దాసు తీశాడు.
కృష్ణ జీవితంలో ‘సాక్షి’ మూవీ ఓ మైలురాయి. బాపు డైరెక్షన్లో 1967లో వచ్చిన ఈ మూవీ తొలి స్కోప్ టెక్నోవిజన్ సినిమాగా రికార్డు సృష్టించింది. 1974లో కృష్ణ 100వ చిత్రం చేశారు. ఆసినిమా ‘అల్లూరి సీతారామరాజు’. ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తారు. వి. రామచంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ తొలి స్కోప్ సినిమాగా ప్రఖ్యాతి పొందింది. ఇక 1982లో తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమాను కృష్ణ నే దక్కించుకున్నాడు. అదే ‘ఈనాడు’. పర్వతనేని సాంబశివరాలు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ తో కృష్ణకు నెంబర్ వన్ ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

విభిన్న సినిమాలు చేసే కృష్ణ 1986లో ‘సింహాసనం’ లో నటించారు. ఈ సినిమాకు కృష్ణ స్వీయ దర్శక్తవం వహించారు. ఒకేసారి తెలుగు, హిందీలో రిలీజ్ చేసి తొలి 70 ఎంఎం, 6 ట్రాక్ స్టీరియో సినిమాగా రికార్డు సృష్టించారు. ఆ సినిమాలను ఇప్పట్లో చిత్రీకరించాలే రూ.100 కోట్లకు పైమాటే అని కృష్ణ పలు సందర్బాల్లో చెప్పారు. అంతేకాకుండా తొలి మెగా పోన్ పట్టుకున్నదీ కృష్ణ మాత్రమే.
తొలి డీటీఎస్ సినిమా చేసిన ఘనత కూడా కృష్ణ కే దక్కింది. అల్లూరి సీతారామారాజుకు సీక్వెల్ గా 1995లో వచ్చిన వచ్చిన తెలుగువీరలేవరా మూవీని ఇవీవీ డైరెక్షన్ చేశారు. అయితే ఇది ప్రేక్షకులను ఆదరించలేకపోయింది. వీటితో పాటు ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసింది కృష్ణ నే. తన సినీ కెరీర్ లో 9 ఏళ్లలో 100 సినిమాలు చేసిన ఏకైక హీరో కృష్ణనే కావడం విశేషం. 1972లో ఆయన 18 సినిమాల్లో నటించారు. అంతకుముందు 1971లో 11, 1970లో 16 సినిమాలు చేశారు