G20 Summit 2022 Modi- Joe Biden: ప్రధాని నరేంద్ర మోదీకి ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. మన దగ్గర ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేసినా.. ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక విదేశాలకు వెళ్తే మాత్రం ఆయన రాక కోసం అక్కడి అభిమానేలే కాదు.. ఆయా దేశాల అధినేతలు ఎదరు చూస్తారు అంటే మోదీ పవర్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్ పర్యటనలకు మోదీ వెళ్లినప్పుడు ఆయా దేశాల్లోని భారతీయులతోపాటు అక్కడి ప్రజలు కూడా మోదీ కోసం ఎదురు చూశారు. మోదీ.. మోదీ అంటూ ఆయనతో ఏర్పాటు చేసిన సమావేశ ప్రాంగణాలు మార్మోగాయి. ఆయా దేశాల అధినేతలు కూడా మోదీకి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికారు. విదేశాంగ విధానం అమలులో మోదీ తనదైన చతురత ప్రదర్శిస్తూ.. అగ్రదేశాల అధినేతలకు మంచి మిత్రుడిగా గుర్తింపు పొందారు. విశ్వగురువుగా కీర్తించబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఇండోనేషియా బాలీలో ఆవిష్కృతమైంది.

-అమెరికా అధ్యక్షుడు అలింగనం..
ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జీ20 సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే బాలికి చేరుకున్నారు. అక్కడి అపూర్వ కెంపిన్‌స్కి హోటల్‌కు చేరుకున్నారు. అక్కడఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మోదీకి ఘన స్వాగతం పలికారు. జీ20 లీడర్స్ సమ్మిట్‌లో ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ సెషన్‌లో పాల్గొన్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకున్నారు. వారిద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేశారు. మోదీ ఫుడ్ అండ్ ఎనర్జీ సెషన్‌లో పాల్గొన్న కొద్దిసేపటికే బైడెన్ ఆయనను కలుసుకోవడానికి వచ్చారు. బైడెన్ తనవైపు వస్తోండటాన్ని గమనించిన మోదీ తన కుర్చీ నుంచి లేచి.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేశారు. ఆ సమయంలో అక్కడే నిల్చుని ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌ను బైడెన్‌కు పరిచయం చేశారు మోదీ. కొద్దిసేపు అక్కడే నిల్చుని మాట్లాడారు. ఆ తరువాత మోదీ పక్క కుర్చీలోనే ఆసీనులయ్యారు బైడెన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధాని మోదీ కొద్దిసేపు సంభాషించారు.

-మోడీ దగ్గరకు వచ్చి మరీ అగ్రరాజ్య అధినేత షేక్ హ్యాండ్ వీడియో వైరల్..
ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వేదికపై మోదీ వద్దకు నడుచుకుంటూ రావడం, మోదీ కూడా మర్యాద పూర్వకంగా లేచి కరచాలనం చేయడం.. ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించడం.. పరిచయ కార్యక్రమం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మోదీ పవర్‌ను నెటిజన్లు మోసారి కీర్తిస్తున్నారు. దటీజ్ మోదీ.. మేరా భారత్ మహాన్.. పవర్ ఆఫ్ ఇండియా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
#WATCH | US President Joe Biden walks over to PM Narendra Modi before the start of #G20Summit in Bali, Indonesia.
(Source: DD) pic.twitter.com/2ULTveCaqh
— ANI (@ANI) November 15, 2022
-వృద్ధిరేటు గాడిన పెట్టడంపై చర్చ..
ప్రపంచ వృద్ధి రేటును మళ్లీ గాడిన పెట్టడం, ఆహారం– ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటలీకరణతో సహా పలు అంశాలపై జీ20 సమ్మిట్‌లో మోదీ విస్తృతంగా చర్చలు జరుపుతారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షిస్తారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వారికి వివరిస్తారు. అనంతరం ఇండోనేషియాలో స్థిరపడిన భారతీయులను ఆయన కలుసుకుంటారు.