Rashi Khanna: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు రాశీ ఖన్నా..ఈమె నటించిన సినిమాలన్నీ కూడా పెర్ఫార్మన్స్ కి బాగా స్కోప్ ఉన్న సినిమాలే అవ్వడం విశేషం..అందం మరియు అభినయం రెండు కలిసి ఉండడం హీరోయిన్స్ కి చాలా అరుదైన కాంబినేషన్..చాలా తక్కువ మందికి మాత్రమే రెండు ఉంటాయి..వారిలో రాశీ ఖన్నా కూడా ఒకరు..ముఖ్యంగా ఈమె కామెడీ టైమింగ్ అదుర్స్..కానీ రాశీ ఖన్నా తనకి ఉన్న టాలెంట్ కి తగ్గ స్థానం లో లేదనే చెప్పాలి.

పాపం ఆమె బ్యాడ్ లక్ కూడా అందుకు కారణం అని చెప్పొచ్చు..చాలా కాలం నుండి సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న రాశీ ఖన్నా లేటెస్ట్ గా కార్తీ తో సర్దార్ అనే సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది..అయితే రాశీ ఖన్నా గతం లో చాలా సూపర్ హిట్ సినిమాలు చేసే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చింది..ఆ సినిమాలేంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
రాశీ ఖన్నా వదులుకున్న బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఒకటి ‘గీత గోవిందం’..ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక కి ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఆమెని రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ ని చేసిన చిత్రం ఇది..అలాంటి సూపర్ హిట్ సినిమాని రాశీ ఖన్నా డేట్స్ సర్దుబాటు చెయ్యలేక వదులుకుందట..ఇక ఆమె వదులుకున్న మరో సూపర్ హిట్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’..మహేష్ బాబు తో సినిమా అంటే ఎవరైనా వదులుతారా..కానీ రాశీ ఖన్నా కి క్యారక్టర్ నచ్చక వదిలేసిందట..ఈ సినిమాని కూడా రష్మికానే చేసింది..అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘F2’ మరియు ‘F3 ‘ చిత్రాలలో కూడా వరుణ్ తేజ్ కి జోడిగా ముందు రాశీ ఖన్నా నే అనుకున్నారట..కానీ ఎందుకో ఆమె ఈ సినిమాలో కూడా నటించలేదు.

ఆమె రిజెక్ట్ చేసిన ఆరు సినిమాల్లో మూడు సినిమాలు అనిల్ రావిపూడివే అవ్వడం విశేషం..గతం లో ఆమె అనిల్ రావిపూడి తెరకెక్కించిన సుప్రీమ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది..అది అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..అయినా కానీ ఆమె ఆ తర్వాత అనిల్ సినిమాలలో నటించడానికి ఆసక్తి ఎందుకు చూపించలేదో ఇప్పటికి అంతు చిక్కని ప్రశ్న..ఈ సినిమాలో తో ‘రాక్షసుడు’ మరియు ‘మహానుభావుడు’ వంటి సినిమాలను కూడా మిస్ చేసుకుంది ఆమె..ఈ సినిమాలన్నీ ఆమె ఒప్పుకొని చేసి ఉంటే కచ్చితంగా సౌత్ ఇండియా లో పెద్ద స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఉండేది..పాపం రాశీ ఖన్నా బ్యాడ్ లక్.