Pawan Kalyan- Mahesh Babu: మన టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ హీరోల మధ్య మంచి సఖ్యత మాత్రం నేటి తరం స్టార్స్ అందరి మధ్య ఉంది..ఎన్టీఆర్ ,ఏఎన్నార్ , కృష్ణ మరియు శోభన్ బాబు కాలం లో హీరోలు ఎంతో సన్నిహితంగా ఉండేవారు..మల్టీస్టార్ర్ర్ సినిమాలు కూడా వాళ్ళవి అప్పట్లో చాలానే వచ్చాయి..ఆ తర్వాతి తరమైన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున మరియు వెంకటేష్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఎందుకో వీళ్ళ కాంబినేషన్స్ లో ఒక్క మల్టీస్టార్ర్ర్ సినిమా కూడా రాలేదు.

కానీ నేటి తరం హీరోలు మాత్రం వాళ్ళ మధ్య ఉన్న స్నేహాన్ని కొనసాగిస్తూనే మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేస్తున్నారు..ఎన్టీఆర్ , రామ్ చరణ్ , ప్రభాస్ మరియు అల్లు అర్జున్ మధ్య ఎంతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది..కానీ ఇండస్ట్రీ లో పెద్ద బయటపడని స్నేహితులు ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహం అని చెప్పొచ్చు.
వీళ్లిద్దరు బయట కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువే కానీ అంతర్గతం గా ఎంతో మంచి స్నేహితులు అని చెప్పొచ్చు..ఉదాహరణకి పవన్ కళ్యాణ్ ప్రతీ పుట్టిన రోజు నాడు మహేష్ బాబు శుభాకాంక్షలు తెలియచేస్తాడు..అలాగే పవన్ కళ్యాణ్ కూడా మహేష్ బాబు కోసం ఒకసారి పెద్ద వ్యాసం సైజు శుభాకాంక్షలు తెలియచేసాడు..అంతే కాకుండా మహేష్ బాబు సినిమా పైరసీ కి గురైతే పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రెస్ మీట్ కి వచ్చి సపోర్ట్ చేసాడు..మహేష్ బాబు కూడా పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు..అలా వాళ్ళ మధ్య ఎన్నో జరిగాయి.

ఇక ప్రతీ క్రిస్మస్ కి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కుటుంబానికి గిఫ్టులు పంపిస్తూ ఉంటాడు..ఈ క్రిస్మస్ కి కూడా ఆయన విలువైన బహుమతులు పంపించాడట..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..పవన్ కళ్యాణ్ తన మనసుకి ఎంతో దగ్గరైన వాళ్ళకే గిఫ్టులు పంపుతూ ఉంటాడు..అలా మహేష్ బాబు కి కూడా పంపాడు అంటే వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందొ అర్థం చేసుకోవచ్చు.