Pushpa Russia Closing Collections: పరిథి దాటి ఊరికే రిస్కులు చెయ్యకూడదు అని పెద్దలు చెప్పిన మాట నిజం అని చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది..రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయం లో కూడా అదే జరిగింది..ఆయన హీరో గా నటించిన పుష్ప చిత్రం గత ఏడాది విడుదలై పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరుకు ప్రతీ ఒక్కరు ఈ సినిమా ని చూడడానికి ఎగబడ్డారు.

భాష తో సంబంధం లేకుండా అల్లు అర్జున్ కి నీరాజనాలు పలికారు ప్రేక్షకులు..అయితే రీసెంట్ గా పుష్ప విషయం లో అల్లు అర్జున్ ఇచ్చిన ఒక ఐడియా నిర్మాతలకు మూడు కోట్ల రూపాయిలు నష్టం వచ్చేలా చేసింది..ఇక అసలు విషయానికి వస్తే ‘మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్’ లో పుష్ప చిత్రాన్ని ప్రదర్శించారు..మంచి రెస్పాన్స్ వచ్చింది..దీనితో పుష్ప చిత్రాన్ని తెలుగు సినిమాలకు అసలు మార్కెట్ లేని రష్యా లో విడుదల చేద్దామనే ఐడియా మేకర్స్ కి ఇచ్చాడు అల్లు అర్జున్.
రష్యా లో పుష్ప సినిమా హిట్ అయితే ‘పుష్ప 2’ కి కూడా విడుదల చేద్దామని..అలా చిన్నగా ఆ చిత్రాన్ని పాన్ వరల్డ్ సినిమాగా మార్చి ప్రపంచం లో ఉన్న అన్నీ బాషలలో విడుదల చేద్దామని అల్లు అర్జున్ మేకర్స్ తో అన్నాడట..ఆయన మాటకు విలువ ఇచ్చి ఈ చిత్రాన్ని రష్యన్ భాషలోకి డబ్ చేసి డిసెంబర్ 8 వ తేదీన రష్యా మొత్తం ఘనంగా విడుదల చేశారు..ప్రొమోషన్స్ కోసం అల్లు అర్జున్ తో పాటుగా మూవీ యూనిట్ మొత్తం రష్యా కి వెళ్ళింది..అందుకోసం మూడు కోట్ల రూపాయిల ఖర్చు చేసింది మైత్రి మూవీ మేకర్స్.

కానీ ఖర్చు చేసిన ఆ మూడు కోట్ల రూపాయలలో పావు శాతం కూడా ఈ చిత్రం కలెక్షన్స్ రూపం లో రాబట్టలేకపోయింది..ఫలితంగా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది..కనీసం ప్రింట్ ఖర్చులు కూడా ఈ సినిమా రాబట్టలేక పోవడం విశేషం..ఇండియన్ సినిమాలకు పెద్దగా మార్కెట్ లేని రష్యా లో సినిమా విడుదల చెయ్యాలి అనుకోవడం పెద్ద పొరపాటు..#RRR చిత్రాన్ని విదేశీయులు ఎగబడి చూసారని ప్రతీ సినిమాని చూస్తారని రూల్ ఏమి లేదంటూ విశ్లేషకులు చెప్తున్న మాట.